సాధారణంగా వెండితెర, బుల్లితెర పై ఒక్కసారి కనిపిస్తే చాలు జన్మధన్యం రా బాబూ అనుకునే వాళ్లు ఏంతోమంది ఉన్నారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ స్టూడియోల వెంట వేల మంది పడిగాపులు కాస్తుంటారు. ఇక ఇండస్ట్రీలోకి ఎంట్రీ తర్వాత నటించే పాత్రల ప్రభావం కూడా ఉంటుంది.
ఎన్నో ఏళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను సీరియల్స్ ఎంతలా ఆకట్టుకుంటున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇదివరకు సినిమాలలో చూసే స్టంట్స్ అన్నీ ఈ మధ్యకాలంలో సీరియల్స్ లో కనిపిస్తున్నాయి. అవన్నీ చూసినవే అనిపించినా.. ప్రతి సీరియల్ కి ఫ్యాన్ బేస్ కూడా భారీ లెవెల్ లోనే ఉంటుంది. ముఖ్యంగా సీరియల్స్ కి మహిళా అభిమానులే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అమ్మాయిలు, గృహిణులు సినిమాలు చూస్తారో లేదోగానీ, సీరియల్స్ మాత్రం టైంకి, క్రమం తప్పకుండా అన్ని ఎపిసోడ్స్ చూస్తుంటారు. ఒకవేళ ఎపిసోడ్ […]