ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకం ద్వారా ప్రతి ఏడాది కేవలం రూ.20 చెల్లించి రూ. 2 లక్షల ప్రమాద బీమా పొందవచ్చు. ఏదేని అనుకోని ప్రమాదం జరిగినప్పుడు పాలసీదారులు మరణించినా లేదా అంగవైకల్యం పొందినా ఈ బీమా ప్రయోజనం లభిస్తుంది.
‘ఏడాదికి 20 రూపాయలు కడితే చాలు.. 2 లక్షల రుపాయల ప్రమాద బీమా..’ ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన(పీఎంఎస్‌బీవై) పథకం ద్వారా ఈ భీమా అందిస్తున్నారు. ఏదైనా అనుకోని ప్రమాదాలు సంభవించి మరణించినా లేదా వైకల్యం సంభవించినా ఆపద వేళల అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎంఎస్‌బీవై పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా అకాల మరణానికి, శాశ్వత అవిటితనానికి 2లక్షల రూపాయల బీమాను, శాశ్వత పాక్షిక్ష అవిటితనానికి లక్ష రూపాయల బీమాను అందిస్తున్నారు. ప్రధాన మంత్రి […]