సినీ ఇండస్ట్రీలో నిలదొక్కు కోవడం అంటే ఆషా మాషీ విషయం కాదు. ఎందరో తెలుగు పరిశ్రమలో ఒక స్థాయికి రావాలని పొట్ట చేత పట్టుకుని వచ్చారు. అలా చాలా మంది నటులు, దర్శకులు చిన్న స్థాయి నుండి కెరీర్ ను ప్రారంభించి... అంచలంచెలుగా ఎదుగుతూ అగ్రస్థాయికి చేరుకున్నారు. అలాంటి వారిలో సినీయర్ నటుడు, మాజీ ఎంపీ మురళి మోహన్ ఒకరు.
ప్రపంచాన్ని తెగ భయపెట్టిన కరోనా థర్డ్ వేవ్ కరుణించి పక్కకు తప్పుకుంది…. ఆంధ్రాలో టికెట్ రేట్ల వివాదం సద్దుమణిగి భారీ బడ్జెట్ చిత్రాలకు మార్గాన్ని సుగమం చేసింది.. ఇలా ప్రతికూల పరిస్థితులు అనుకూల పవనాలుగా మారిన నేపథ్యంలో విడుదలయ్యే సినిమాలు ఏమాత్రం బాగున్నా బ్రహ్మరథం పడతాం.. ఏ మాత్రం తేడా వచ్చినా భరతం పట్టేస్తాం.. అన్నట్టుగా మంచి అవైటింగ్ మూడ్ లో ఉన్నాడు ప్రేక్షకుడు. అందుకే ఒక్కొక్కటిగా క్యూ కడుతున్నాయి భారీ అంచనాల భారీ చిత్రాలు.. బహు […]