సినీ ఇండస్ట్రీలో నిలదొక్కు కోవడం అంటే ఆషా మాషీ విషయం కాదు. ఎందరో తెలుగు పరిశ్రమలో ఒక స్థాయికి రావాలని పొట్ట చేత పట్టుకుని వచ్చారు. అలా చాలా మంది నటులు, దర్శకులు చిన్న స్థాయి నుండి కెరీర్ ను ప్రారంభించి... అంచలంచెలుగా ఎదుగుతూ అగ్రస్థాయికి చేరుకున్నారు. అలాంటి వారిలో సినీయర్ నటుడు, మాజీ ఎంపీ మురళి మోహన్ ఒకరు.
సినీ ఇండస్ట్రీలో నిలదొక్కు కోవడం అంటే ఆషా మాషీ విషయం కాదు. ఎందరో తెలుగు పరిశ్రమలో ఒక స్థాయికి రావాలని పొట్ట చేత పట్టుకుని వచ్చారు. అలా చాలా మంది నటులు, దర్శకులు చిన్న స్థాయి నుండి కెరీర్ ను ప్రారంభించి… అంచలంచెలుగా ఎదుగుతూ అగ్రస్థాయికి చేరుకున్నారు. అలాంటి వారిలో ఒకరు.. ప్రముఖ నటుడు, నిర్మాత, మాజీ ఎంపీ మురళీ మోహన్. మదర్స్ డే సందర్భంగా ‘ మిథునం చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ వీణపాణి గారు ఒక పాటను రచించారు. ఆ పాటను సీనియర్ నటులు మురళీమోహన్ గారు విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తైందని తెలిపారు. తొలిసారిగా 1973 మార్చినెలలో హీరోగా పరిచయమై 50 ఏళ్ళు పూర్తయియ్యాన్నారు. ఇంక ఆయన మాట్లాడుతూ.. ” నేను ఎప్పుడూ కూడా నాకు ఇన్నేళ్ల సినీ ప్రయాణం ఉంటుందని అనుకోలేదు. నేను మొదటిసారి సినిమాకి వచ్చినప్పుడు నాకు 33ఏళ్ళు ఉంటాయి. ఏదో ఒక 15ఏళ్ళు ఉంటానేమో అనుకున్నా.కానీ అదృష్టం కలిసిరావడం వల్ల అందరూ సహకరించడంతో నాకు ఈ అవకాశం కలిగింది. నేను అనుకోకుండా యాక్టర్ అయ్యాను. నాకు తొలి నుంచి వ్యాపారంపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. వ్యాపారం చేస్తున్నే మధ్యలో అనుకోకుండా రాజకీయాల్లోకి వెళ్ళాను.
ప్రస్తుతం అవన్నీ పూర్తిగా వదిలేసి కంప్లీట్‌గా సినిమాలకు అంకితం అవ్వాలనుకుంటున్నాను. అక్కినేని నాగేశ్వరరావుగారే నా స్ఫూర్తి. నేను కూడా ఆయన లాగే ఇక నటనకే అంకితం అవుతాను” అని ఆయన అన్నారు. ఇక మురళీ మోహన్ గురించి పలువురు సీనియర్ జర్నిలిస్టులు మాట్లాడారు. సీనియర్ జర్నలిస్టు ప్రభు మాట్లాడుతూ…” మురళీమోహన్ గారి గురించి మనం ఇప్పుడు కొత్తగా చెప్పుకునేది ఏమీ లేదు. ఆయన ఎన్నో అద్భుతమైన చిత్రాలను మనకు అందించారు. సినిమా ఇండస్ట్రీ నటీనటులు అంటే ఇలా ఉంటారు, విచ్చలవిడిగా ఉంటారనే వాటికి పూర్తి భిన్నంగా ఆయన ఉంటారు. ఇండస్ట్రీపై సమాజంలో ఉన్న ఆలోచనకు పూర్తి భిన్నంగా ఆయన జీవితం ఉంటుంది.ప్రతిదీ కూడా ఎంతో క్రమశిక్షణతో ఆయన నడవడిక ఉంటుంది” అని తెలిపారు.