నేటికాలంలో చాలా మంది యువత జాబ్ లు చేస్తూ జీవితాన్ని గడిపేస్తున్నారు. అయితే ఇందులో కొంతమందికి ఉద్యోగాలు చేయడంపై ఆసక్తి ఉండదు. కేవలం సమాజం, తల్లిదండ్రుల కోసం మాత్రమే చేస్తుంటారు. మరికొందరికి మాత్రం వ్యాపారం చేయాలనే కోరిక బలంగా ఉంటుంది. అలాంటి వారికి ఓ సువర్ణ అవకాశం లభించింది.
ప్రస్తుతం మన దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ముఖ్యమైనది.. నిరుద్యోగం. ప్రభుత్వ శాఖల్లో కొలువులు తక్కువ.. కాంపిటీషన్ ఎక్కువ. ఇక ప్రైవేటు జాబ్ అంటే.. పని ఎక్కువ.. జీతం తక్కువ.. పైగా ఏ నిమిషం ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోననే భయం ఉంటుంది. ఈ గోల దేనికి.. చక్కగా ఏదైన పరిశ్రమ స్థాపించి.. మనకు మనం పని కల్పించుకోవడమే కాక.. మరి కొందరికి ఉపాధి కల్పిస్తే ఎంత బాగుంటుందని కొందరు ఆలోచిస్తారు. ఆలోచన సరే.. మరి ఆచరణలో […]