నేటికాలంలో చాలా మంది యువత జాబ్ లు చేస్తూ జీవితాన్ని గడిపేస్తున్నారు. అయితే ఇందులో కొంతమందికి ఉద్యోగాలు చేయడంపై ఆసక్తి ఉండదు. కేవలం సమాజం, తల్లిదండ్రుల కోసం మాత్రమే చేస్తుంటారు. మరికొందరికి మాత్రం వ్యాపారం చేయాలనే కోరిక బలంగా ఉంటుంది. అలాంటి వారికి ఓ సువర్ణ అవకాశం లభించింది.
నేటికాలంలో చాలా మంది యువత జాబ్ లు చేస్తూ జీవితాన్ని గడిపేస్తున్నారు. అయితే ఇందులో కొంతమందికి ఉద్యోగాలు చేయడంపై ఆసక్తి ఉండదు. కేవలం సమాజం కోసం మాత్రమే చేస్తుంటారు. మరికొందరు వ్యాపారం చేయాలనే కోరిక బలంగా ఉంటుంది. అలా మీరు కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ విసిగిపోయారా? పని భారం ఎక్కువ, జీతం తక్కువ కావడంతో ఇబ్బందులు పడుతున్నారా? ఎప్పటికైన చిన్న వ్యాపారం చేయాలని భావిస్తున్నారా?. అయితే మీ ఆలోచనలను సాకారం చేసే ప్లాన్ ఒకటి ఉంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
చాలా మంది యువతకు వ్యాపారం చేయాలనే కోరిక బలంగా ఉంటుంది. అందుకు తగినట్లు వారి ఆలోచనలు కూడా ఉంటాయి. కానీ కొందరు మాత్రం నిధులు లేక తమ ఆలోచనలు ఆచరణలో పెట్టలేకపోతున్నారు. ఇలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను, అవకాశాలను కల్పిస్తుంది. కారణంగా దేశ ఎకానామీ 2024 నాటికి 5ట్రిలియన్ డాలర్లకు పెరగాలన్నది కేంద్రం లక్ష్యం. అయితే ఆ టార్గెట్ అందుకోవాలంటే చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తాయి.
ఎంత ఎక్కువ సంఖ్యలో ఈ చిన్న, మధ్య తరహా వ్యాపారాలు ఏర్పడతాయో అంత పెద్ద మొత్తంలో జీడీపీ పెరుగుతుంది. అందుకే కేంద్రం ప్రభుత్వం ఔత్సాహికల వ్యాపారవేత్తలకు ప్రోత్సాహం ఇస్తోంది. పీఎంఈజీపీ స్కీమ్ కింద లోన్ ఇస్తుంది. ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కింద వ్యాపారం చేయడంపై ఆసక్తికలిగిన యువతను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అలానే క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ ద్వారా చేయూతనందిస్తోంది. ఈ కార్యక్రమాన్ని కుటీర, చిన్న, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖ(ఎంఎస్ఎంఈ)నిర్వహిస్తోంది.
ఈ శాఖకు నోడల్ఏజెన్సీగా నేషనల్ లెవల్ లో కేవీఐపీ వ్యవహారిస్తోంది. అదే రాష్ట్ర స్థాయిలో అయితే కేవీఐసీ, కేవీఐబీలు ఉంటాయి. ఇక జిల్లా స్థాయిలో జిల్లా పరిశ్రమల కేంద్ర దీనిని నిర్వహిస్తోంది. ఇక పీఎంఈజీపీ పథకం కింద రుణం వివిధ స్థాయిలో ఉంటుంది. పీఎంఈజీపీ కింద తయారీ రంగానికి చెందిన ప్రాజెక్టుకు గరిష్ట పరిమితి రూ.50 లక్షలు ఇస్తారు. గతంలో ఈ రుణం రూ.20లక్షలకు ఉండేది. అలాగే సేవ రంగానికి చెందిన వ్యాపారంలో కూడా రూ.25 లక్షల వరకు రుణం ఇస్తారు. గతంలో ఇది రూ.10 లక్షలు ఉండేది. ఇందులో గ్రామీణ ప్రాంతాలకు చెందిన జనరల్ కేటగిరీ వారికి 25శాతం సబ్సిడీ ఉంటుంది.
అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారీటీస్, దివ్యాంగులకు 35శాతం సబ్సిడీ ఉంటుంది. దేశ వ్యాప్తంగా 27 బ్యాంకులు ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. దరఖాస్తుల కోసం కేవీఐసీ అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించాలి. పీఎంఈజీపీలో భాగంగా వ్యవసాయేతర నూతన పరిశ్రమలు స్థాపనకు, ఉద్యోగాలు కల్పనకు ఈ పథకాన్ని నిర్వహిస్తున్నారు. మరి.. ఈ ప్రాజెక్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.