కూలి పని, చేతి వృత్తి ఏదైతే ఏముంది.. కష్టపడి పని చేసే వాళ్ళకి పెద్దగా సంపాదించుకునే అవకాశం ఉండదు. ఎంత కష్టపడినా నెలకు రూ. 30 వేలు నుంచి రూ. 50 వేలు మించి సంపాదించలేరు. కానీ ఒక వ్యక్తి మాత్రం కష్టపడుతూ ఏడాదికి రూ. 2 కోట్లు పైనే సంపాదిస్తున్నాడు. ఏంటి ఆశ్చర్యంగా ఉంది కదూ. కష్టపడితే చెమట వస్తుంది కానీ కోట్లు ఎలా వస్తాయని అనుకుంటున్నారా? అయితే ఈ వ్యక్తి గురించి తెలుసుకోవాల్సిందే.
లక్కు ఉండాలేగానీ ఏ పని చేసేవారికైనా అదృష్టం కలిసివస్తుంది. కానీ మనది కానిది బంగారపు నిధి అయినా కూడా కొంతమంది ముట్టరు. అలాంటి నిజాయితీ పరుడి వార్తే ఇది. అమెరికాలో ప్లంబర్‌గా పనిచేసే ఒక వ్యక్తి చర్చిలో బాత్రూమ్ రిపేర్ ఉంటే చేసేందుకు వెళ్లాడు. రిపేర్‌లో భాగంగా బాత్రూమ్ గోడ పగలగొట్టాల్సి వచ్చింది. ప్లంబర్ దాన్ని పగలగొట్టగా.. అందులోంచి డబ్బుల మూట బయటపడింది. మన కరెన్సీలో అయితే ఏకంగా 4.5 కోట్ల రూపాయలు అందులో ఉన్నాయి. అంత […]