లక్కు ఉండాలేగానీ ఏ పని చేసేవారికైనా అదృష్టం కలిసివస్తుంది. కానీ మనది కానిది బంగారపు నిధి అయినా కూడా కొంతమంది ముట్టరు. అలాంటి నిజాయితీ పరుడి వార్తే ఇది. అమెరికాలో ప్లంబర్‌గా పనిచేసే ఒక వ్యక్తి చర్చిలో బాత్రూమ్ రిపేర్ ఉంటే చేసేందుకు వెళ్లాడు. రిపేర్‌లో భాగంగా బాత్రూమ్ గోడ పగలగొట్టాల్సి వచ్చింది. ప్లంబర్ దాన్ని పగలగొట్టగా.. అందులోంచి డబ్బుల మూట బయటపడింది. మన కరెన్సీలో అయితే ఏకంగా 4.5 కోట్ల రూపాయలు అందులో ఉన్నాయి.
అంత భారీ మొత్తం దొరికినా కూడా టెక్సాస్‌కు చెందిన జస్టిన్ కౌలీ అనే ప్లంబర్ ఆ డబ్బును పోలీసులకు అప్పగించి, తన నిజాయితీని చాటుకున్నాడు. వాస్తవానికి ఆ డబ్బు 2014లో చర్చిలో చోరీకి గురైనట్లు.. చర్చి నిర్వహకులు పోలీసులకు అప్పుడే ఫిర్యాదు చేశారు. ఆ డబ్బు ఇప్పుడు గోడలో నుంచి బయటపడినట్లు నిర్ధారించారు. డబ్బును చోరీ చేసిన వారి అక్కడ దాచి ఉంటారని పోలీసులు అనుమానపడుతున్నారు. పోయిందనుకున్న చర్చి డబ్బు ప్లంబర్ రూపంలో దొరకడంతో చర్చి నిర్వహకులు ప్లంబర్ కౌలీకి రూ.17 లక్షల రూపాయలు బహుమానంగా అందించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: లైవ్ లో పడ్డ పిడుగు! వైరల్ అవుతున్న సీసీటీవీ ఫుటేజ్!