ఈ మద్య కొంతమంది అత్యుత్సాహంతో డ్రైవింగ్ గురించి పూర్తిగా అవగాహన లేకున్నా రోడ్లపై బైక్స్, కార్లు నడుపుతున్నారు. ఆ సమయంలో కొన్ని ప్రమాదాలు జరిగి అమాయకుల ప్రాణాలు కూడా పోతున్నాయి.
దేశంలో నిత్యం వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది. ఈ క్రమంలో పార్కింగ్ సమస్య కూడా దారుణంగా పెరిగిపోతుంది. దేశ వ్యాప్తంగా పార్కింగ్ సమస్యలు ఎదురు కావడంతో కొంత మంది తమ వాహనాలను ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేస్తుంటారు. దీని వల్ల రోడ్డు పై వెళ్తున్నవారికి ఇబ్బందులు కలుగుతుంటాయి. నో పార్కింగ్ అనే బోర్డులు ఏర్పాటు చేసినా వాటిని కొంత మంది పట్టించుకోరు. ఈ క్రమంలో కేంద్రం త్వరలో ఓ కొత్త చట్టం తీసుకు వచ్చేందుకు సన్నద్దమవుతుంది. […]