కాలంతో పాటు పెరుగుతున్న టెక్నాలజీని సామాన్యులు అందుకోవాలంటే ఈరోజుల్లో సాధ్యమయ్యే పనికాదు. అందుకోసం ప్రభుత్వమే టెక్నాలజీని జనాలకు దగ్గరచేసే ప్రయత్నం చేస్తుంది. సామాన్యంగా యూపీఐ పేమెంట్ సేవలు స్మార్ట్ ఫోన్స్ వరకే పరిమితమైన విషయం తెలిసిందే. త్వరలో ఫీచర్ మొబైల్(కీప్యాడ్ ఫోన్)లో కూడా యూపీఐ పేమెంట్స్ విధానం అమలు కానుంది. అదీగాక ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఫీచర్ మొబైల్స్ లో యూపీఐ చెల్లింపులు చేసుకునేందుకు సరికొత్త పేమెంట్ సిస్టమ్ అందుబాటులోకి రాబోతుండటం విశేషం. తాజాగా ఆర్‌బీఐ గవర్నర్ […]
ఇప్పటికే పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్, నిత్యవసరాల ధరలకు తోడు డిజిటలైజేషన్‌తో మన నిత్యజీవితంలో భాగమైన మనీ ట్రాన్సాక‌్షన్ యాప్‌లు కూడా సామాన్యుడి నడ్డి విరేచేందుకు సిద్ధమయ్యాయి. పెట్రోలు, డీజిల్ ధరలు సెంచరీ కొట్టేసి రూ.120 మార్క్ చేరుకునేందుకు పరుగుపెడుతున్నాయి. ఇదే బాటలో ప్రైవేటు రంగంలోని డీటీహెచ్, ప్రైమ్ వీడియోల సబ్‌స్క్రిప్షన్స్ రేట్లు ఉన్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా ఫోన్‌పే వచ్చి చేరింది. ఇంత కాలం ఉచితంగా అందించిన సర్వీసులకు యూజర్ ఛార్జీలను చేర్చింది. వినియోగదారులకు నేరుగా ఈ […]