మారుమూల గ్రామాల్లోనే వైద్యం చేస్తే ఫీజు కింద కనీసం రూ. 50 నుంచి రూ. 100 తీసుకుంటున్నారు డాక్టర్లు. అలాంటిది ఒక్క రూపాయికే వైద్యం అందించడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ కార్పొరేట్ వైద్యం.. పైగా హైదరాబాద్ లాంటి నగరంలో. ఎవరయ్యా ఆ మహానుభావుడు? కార్పొరేట్ హాస్పిటల్ కి వెళ్లాలంటే ఇవాళ అపాయింట్మెంట్ కే వెయ్యి, 1500 లకు పైన ఉంటుంది. ఇక వైద్య పరీక్షలు, మందులకు అంటే పేదవారు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. అసలు కార్పొరేట్ వైద్యం అంటే పేదవారికి అందని ద్రాక్ష. అలాంటి కార్పొరేట్ వైద్యాన్ని ఒక్క రూపాయికే పేద ప్రజలను అందజేస్తున్నారు.
పశ్చిమ బెంగాల్‌లో ఒక రూపాయి డాక్టర్‌గా ఫేమస్ అయిన డాక్టర్ సుశోవన్ బెనర్జీ ఇవాళ కన్ను మూశారు. దాదాపు 60 ఏళ్ళ పాటు కేవలం ఒక్క రూపాయికే ఎందరో రోగులకు చికిత్స అందించిన వైద్యుడిగా గుర్తింపు పొందారు. ఆయన మరణంపై దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. డాక్టర్ సుశోవన్ మరణం పట్ల దేశ ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. పెద్ద మనసున్న వ్యక్తిగా డా.సుశోవన్ గుర్తుండిపోతారని మోదీ ట్వీట్ చేశారు. ఆయన […]