సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి పెద్ద పీట వేస్తూ.. వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారు. ఇక తాజాగా జగన్ సర్కార్ మరో రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలు..
నాయీ బ్రాహ్మణులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల పాలక మండళ్లలో ధర్మకర్తలుగా నాయీ బ్రాహ్మణులను నియమించేలా ఆర్డినెన్స్ జారీ చేసింది. దేవాదాయ శాఖ పరిధిలో 5 లక్షలకు పైబడి ఆదాయం సమకూరే ఆలయాల్లో మాత్రమే దేవాదాయ శాఖ ట్రస్టు బోర్డులను నియమించాలని ఇటీవల హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పు మేరకు.. 5 లక్షలకు పైన ఆదాయం సమకూరే 1234 దేవాలయాల్లో ట్రస్టు బోర్డులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇప్పటికే కొన్ని […]