భారత్- పాకిస్థాన్ క్రికెట్ బోర్డుల మధ్య చాలా సంవత్సరాలుగా సఖ్యత లేని విషయం తెలిసిందే. ఈ రెండు జట్లు కలిసి ఐసీసీ టోర్నీలు ఆడతారా లేదా అనే విషయంలో ఇంకా సందిగ్ధత అలాగే కొనసాగుతుంది. అయితే తాజాగా ఇండో-పాక్ మధ్య టెస్ట్ సిరీస్ ప్రస్తావన రావడం ఆసక్తిని కలిగించింది. దీనిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ నజం సేథి క్లారిటీ ఇచ్చేసాడు.
ఆసియా కప్ 2023 వేదికపై ఇప్పటికీ సందిగ్దతే ఉంది. ఈ క్రమంలోనే పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ నజాం సేథీ కొన్ని చౌకబారు వ్యాఖ్యలు చేశాడు. పాక్ టీమ్ ను ఇండియాకు పంపాలంటే మాకు కూడా భయంగా ఉందని చెప్పుకొచ్చాడు.