భారత్- పాకిస్థాన్ క్రికెట్ బోర్డుల మధ్య చాలా సంవత్సరాలుగా సఖ్యత లేని విషయం తెలిసిందే. ఈ రెండు జట్లు కలిసి ఐసీసీ టోర్నీలు ఆడతారా లేదా అనే విషయంలో ఇంకా సందిగ్ధత అలాగే కొనసాగుతుంది. అయితే తాజాగా ఇండో-పాక్ మధ్య టెస్ట్ సిరీస్ ప్రస్తావన రావడం ఆసక్తిని కలిగించింది. దీనిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ నజం సేథి క్లారిటీ ఇచ్చేసాడు.
భారత్- పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే ఆ క్రేజ్ నెక్స్ట్ లెవల్లో ఉండడం గ్యారంటీ. ఈ రెండు జట్లు చివరిసారిగా 2007 లో టెస్టు సిరీస్ ఆడాయి. ఇక అప్పటినుంచి భద్రత కారణాల దృష్ట్యా పాకిస్థాన్ తో బీసీసీఐ ద్వైపాక్షిక సిరీస్ రద్దు చేసుకుంది. అయితే ఐసీసీ టోర్నీలో మాత్రం కనిపిస్తూ.. ఫ్యాన్స్ కి కిక్ ఇస్తున్నారు. ఈ రెండు జట్ల మధ్య మళ్ళీ ద్వైపాక్షిక సిరీస్ ఏమైనా జరుగుతుందా? లేకపోతే పూర్తిగా రద్దయినట్టేనా? అనే అనుమానాలు అందరిలోనూ నెలకొన్నాయి. తాజాగా ఇండో-పాక్ మధ్య టెస్ట్ సిరీస్ ప్రస్తావన రావడం ఆసక్తిని కలిగించింది. దీనిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ నజం సేథి క్లారిటీ ఇచ్చేసాడు.
భారత్- పాకిస్థాన్ క్రికెట్ బోర్డుల మధ్య చాలా సంవత్సరాలుగా సఖ్యత లేని విషయం తెలిసిందే. ఈ రెండు జట్లు కలిసి ఐసీసీ టోర్నీలు ఆడతారా లేదా అనే విషయంలో ఇంకా సందిగ్ధత అలాగే కొనసాగుతుంది. ఇప్పటికే ఆసియా కప్ కోసం టీమిండియా పాకిస్థాన్ లో ఆడబోమని ఖరాఖండీగా చెప్పేసింది. దీంతో ఈ రెండు జట్లు మ్యాచ్ కోసం తటస్థ వేదికలను ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా ఈ ఏడాది చివర్లో జరగబోయే వరల్డ్ కప్ కోసం మేము భారత్ లో పర్యటించాం తటస్థ వేదికలు ఏర్పాటు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తుంది. ఇదిలా ఉండగా ఇండియా పాకిస్థాన్ లు ద్వైపాక్షిక టెస్టు సిరీస్ లు ఆడేందుకు పీసీబీ.. బీసీసీఐ ని కోరినట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం పీసీబీ చీఫ్ గా ఉంటున్న నజం సేథి ఈ రెండు జట్లు టెస్టు సిరీస్ ఆడేందుకు తటస్థ వేదికలను ఏర్పాటు చేయాల్సిందిగా కోరాడు. అయితే ఈ ప్రతిపాదనను బీసీసీఐ కొట్టి పారేసింది. ఎట్టి పరిస్థితిలో పాక్ తో ద్వైపాక్షిక సిరీస్ ఆడేది లేదని చెప్పేసింది. ఈ విషయాన్ని నజం సేథి సిడ్నీ హెరాల్డ్ కి ఇచ్చిన పత్రికలో చెప్పుకొచ్చాడు. దీని ప్రకారం భారత్- పాకిస్థాన్ జట్ల మధ్య టెస్టు సిరీస్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లేదా సౌత్ ఆఫ్రికాల్లో జరపాలని ప్రతిపాదించాడు. మొత్తానికి ఇప్పట్లో భారత్- పాక్ ద్వైపాక్షిక సిరీస్ లు ఇప్పట్లో లేవని అర్ధం అవుతుంది. మరి బీసీసీఐ.. పాకిస్థాన్ తో సిరీస్ ఆడదే లేదని చెప్పడం మీకేవిధంగా అనిపించింది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.