అన్నం తినేటప్పుడు పంటి కింద చిన్న రాయి తగిలితేనే విలవిల్లాడతాం. ఇక మనకు తెలియకుండానే.. మన అజాగ్రత్త వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. సర్జరీ చేసి తొలగిస్తారు. కానీ కొందరికి వింత అలవాటు ఉంటుంది. నాణేలు, మేకులు, వెంట్రుకలు చూడగానే.. వారికి ఏమవుతుందో తెలియదు.. వెంటనే గుటుక్కున మింగేస్తారు. అలా ఒకటి రెండు కాదు.. వందల సంఖ్యలో. ఎప్పటికో కడుపునొప్పి లాంటిది వస్తే.. అప్పుడు ఆ విషయం బయటపడుతుంది. సరిగా ఇలానే జరిగింది ఓ వ్యక్తి విషయంలో. […]
సాధారణంగా చిన్న గుండు సూదీ గుచ్చుకున్నా.. తల దువ్వే సమయంలో కాస్త గట్టిగా లాగిన బాధతో విలవిల్లాడతాం. అలాంటిది తలలో ఏకంగా ఒకటి కాదు.. రెండు కాదు 8 మేకులు దిగితే.. వామ్మో ఇంకేమైనా ఉందా.. ఈపాటికే ప్రాణాలు పోతాయి అనిపిస్తుంది కదా. కానీ ఇప్పుడు మీరు చదవబోయే వ్యక్తి మృత్యుంజయుడు. తలలో ఎనిమిది మేకులు దిగినా.. తట్టుకుని నిలబడ్డాడు. వైద్యులు అతడికి శస్త్ర చికిత్స చేసి.. తలలో దిగిన మేకులను తొలగించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి […]
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఫేస్ మాస్క్, శానిటైజర్, భౌతికదూరం వంటి వాటిని తప్పనిసరి చేశాయి. అయితే.. వీటిని కొందరు పాటించడకుండానే రోడ్లపై తిరుగుతున్నారు. సాధారణంగా మాస్కులు ధరించకుండా బయటకు వస్తే.. ఆయా రాష్ట్రాల్లోని నిబంధనలను బట్టి రూ.1000 జరిమానా లేదా మూడు లేదా ఆరు నెలల జైలు శిక్ష వంటివి విధిస్తున్నారు. అయితే కొందరు పోలీసులు ఇలాంటి వారిలో బుద్ది రావాలని రకరకాల శిక్షలను వేస్తున్నారు. కుప్పిగంతులు వేయించడం, గుంజీలు తీయించడం వంటి సంఘటనలు […]