అన్నం తినేటప్పుడు పంటి కింద చిన్న రాయి తగిలితేనే విలవిల్లాడతాం. ఇక మనకు తెలియకుండానే.. మన అజాగ్రత్త వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. సర్జరీ చేసి తొలగిస్తారు. కానీ కొందరికి వింత అలవాటు ఉంటుంది. నాణేలు, మేకులు, వెంట్రుకలు చూడగానే.. వారికి ఏమవుతుందో తెలియదు.. వెంటనే గుటుక్కున మింగేస్తారు. అలా ఒకటి రెండు కాదు.. వందల సంఖ్యలో. ఎప్పటికో కడుపునొప్పి లాంటిది వస్తే.. అప్పుడు ఆ విషయం బయటపడుతుంది. సరిగా ఇలానే జరిగింది ఓ వ్యక్తి విషయంలో. తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న వ్యక్తిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతడిని పరీక్షించిన వైద్యులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే.. అతగాడి కడుపులో వందలాదిగా నాణేలు, మేకులు, బ్యాటరీలు ఉన్నాయి. అది చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. ఈ సంఘటన టర్కీలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
ఆ రోగి పేరు జెడ్.., వయసు 35 ఏళ్లు. టర్కీలో బుర్హాన్ డెమిర్ అనే వ్యక్తి తమ తమ్ముడికి కడుపునొప్పిగా ఉందని చెప్పి ఆసుపత్రికి తీసుకొచ్చినట్టు వైద్యులు తెలిపారు. అతని పొట్టను అల్ట్రాసౌండ్, ఎక్స్ రే స్కానింగ్‌లు, ఎండోస్కోపి చేయించారు. ఆ స్కానింగ్‌లలో పొట్ట నిండా ఎన్నో వస్తువులు ఉన్నట్టు గుర్తించారు. అన్నీ వస్తువలు పొట్టలో ఉన్నాయని తెలిసి వైద్యులకు దిమ్మతిరిగింది. అసలు ఎలా మింగాడో తెలియక అయోమయానికి గురయ్యారు. రోగి బంధువులను, రోగిని ప్రశ్నించగా.. తమకు తెలియదని తెలిపారు. వెంటనే ఆపరేషన్ చేసి ఆ వస్తువులన్నింటినీ బయటికి తీశారు. వాటన్నింటనీ ఒక టేబుల్ పరిచగా మొత్తం 233 వస్తువులు ఉన్నట్లు తేలింది.
ఇది కూడా చదవండి: Video: చనిపోతున్న తల్లి చివరి కోరిక తీర్చిన కొడుకు.. కన్నీరు తెప్పిస్తున్న కథ!
చిన్న పిల్లలు తెలియక ఏదైనా మింగేయడం సాధారణం. ఒక్క కాయిన్ మింగితేనే కంగారు పడతా.. నానా హడావిడి చేసి ఎలాగోలా కాయిన్ కక్కిస్తాం. కానీ 35 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తి ఇన్ని వస్తువులు మింగడం సాధారణ విషయం కాదని చెబుతున్నారు వైద్యులు. అతనికి ఏదైనా మానసిక సమస్య ఉండొచ్చని అంటున్నారు. ఇప్పుడు ఆపరేషన్ చేసి అన్నీ తొలగించినా కూడా ఆ రోగి తిరిగి అలాంటి వస్తువుల వైపు ఆకర్షితుడై మళ్లీ మింగే ప్రమాదం ఉందట. కాబట్టి అతడిని కచ్చితంగా మానసిక వైద్యుడికి చూపించాలని చెప్తున్నారు.
ఇది కూడా చదవండి: Lottery: లాటరీ కొని మర్చిపోయారు.. దానికి రూ. 7 కోట్ల ప్రైజ్ మనీ తగిలింది!
ఇవన్ని చూసిన రోగి బంధువులు.. మాముందు ఎప్పుడు ఇలా నాణేలు మింగుతున్నట్లు కనిపించలేదు. కడుపునొప్పి అంటే.. ఏదో అనారోగ్య సమస్య అనుకున్నాం.. కానీ ఇలాంటి వింత ప్రవర్తన గురించి మాకు తెలియదు. ఇక మీదట జాగ్రత్తగా చూసుకుంటాం అని తెలుపుతున్నారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Pillow: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దిండు.. స్పెషాలిటీ ఏంటంటే?..