జీవనోపాధి కోసం పొరుగు రాష్ట్రాలకో, పొరుగు దేశాలకే పరుగులు పెడుతుంటారు భారతీయులు. భార్య, బిడ్డలకు ఎటువంటి కష్టం రాకూడదని, ఆర్థిక ఇబ్బందులు ఎదురు కాకూడదని సంపాదనే ధ్యేయంగా బతుకుతుంటారు. అయితే ఈ క్రమంలో అనుబంధాలు, ఆప్యాయతలను కోల్పోతుంటారు. భర్త దూరమయ్యాడనో లేదో మరే కారణమో తెలియదని కానీ ఓ మహిళ ఏం చేసిందంటే..?
కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పుట్టింటికి వచ్చిన నవ వధువు మొదట్లో కనిపించకుండా పోయి ఆ తర్వాత శవమై కనిపించడంతో స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు మండలం సోమయాజులపల్లెకు చెందిన వెంకట బార్గవికి రెండు నెలల కిందట పులివెందులకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన రెండు నెలల పాటు భార్గవి భర్తతో సంతోషంగానే మెలిగింది. అయితే శ్రావణమాసం కావడంతో ఇటీవల భార్గవి అత్తింటి నుంచి […]