జీవనోపాధి కోసం పొరుగు రాష్ట్రాలకో, పొరుగు దేశాలకే పరుగులు పెడుతుంటారు భారతీయులు. భార్య, బిడ్డలకు ఎటువంటి కష్టం రాకూడదని, ఆర్థిక ఇబ్బందులు ఎదురు కాకూడదని సంపాదనే ధ్యేయంగా బతుకుతుంటారు. అయితే ఈ క్రమంలో అనుబంధాలు, ఆప్యాయతలను కోల్పోతుంటారు. భర్త దూరమయ్యాడనో లేదో మరే కారణమో తెలియదని కానీ ఓ మహిళ ఏం చేసిందంటే..?
దూరపు కొండలు నునుపు అన్న సామెత సరిగ్గా సరిపోతుందీ విదేశాల్లో సంపాదన కోసం పరిగులెత్తేవారికి. అక్కడ రెండింతలు సంపాదించి, పెళ్లాం పిల్లలకు ఎటువంటి లోటు లేకుండా చూడాలన్న అత్యాశతో దేశ గడపను దాటి పరాయి దేశాలకు వెళుతున్నారు. అయితే సంపాదన పరంగా సంతృప్తి ఉంటుందేమో కానీ అనుబంధాలు, ఆపాయ్యతలను మిస్ కాక తప్పదు. భర్తకు దూరంగా పిల్లలను పెట్టుకుని జీవనం సాగిస్తుంటారు భార్య. సంపాదన కన్నా సాయంత్రం వేళకు ఇంటికి వచ్చే భర్త కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటుంది భార్య. కానీ విదేశాలకు వెళ్లే భర్త ఎప్పుడొస్తాడో తెలియక ఆమె జీవితం తెల్లారిపోతుంది. ఒంటరి ఆలోచనను ఆమెను మనస్సును కకావికలం చేస్తాయి. ఆ తర్వాత తీసుకునే నిర్ణయాలు ఊహాతీతం.
వైఎస్సార్ కడప జిల్లాలలో ఓ మహిళ కొన్ని రోజుల నుండి కనిపించడం లేదు. ఖాదర్‌పల్లె గ్రామానికి చెందిన కత్తి నాగ సిందూరి(30) అనే వివాహిత రెండు రోజులుగా కన్పించటం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. చాపాడు మండలంలోని ఖాదర్‌పల్లె గ్రామానికి చెందిన వ్యక్తితో మైదుకూరు మండలంలోని ఉత్సలవరం గ్రామానికి చెందిన నాగ సిందూరికి పదేళ్ల క్రింద వివాహమైంది. అయితే జీవనోపాధి కోసం నాగ సిందూరి భర్త విదేశాలకు వెళ్లగా.. ఇటీవలే ఆయన ఇంటికి వచ్చాడు. కొన్ని రోజులు ఉండి తిరిగి విదేశాలకు వెళ్లిపోయాడు. ఆ క్రమంలో నాగ సిందూరి కనిపించకుండా పోయింది. రెండు రోజులు పాటు వెతికిన కుటుంబ సభ్యులు ఆమె జాడ కానరాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.