ఇటీవల ఎమ్మెల్యే కోమటిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో మునుగోడు కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మునుగోడులో జరిగే కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి క్యాంపు కార్యాలయం నుండి ఉప్పల్ వరకు పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి తీన్మార్ స్టెప్పులతో కార్యకర్తల్లో జోష్ నింపారు. మునుగోడులో టీఆర్‌ఎస్ ప్రజాదీవెన సభకు సుమారు లక్షన్నర మంది కూర్చునేలా 25 ఎకరాల్లో భారీ ఏర్పాట్లు పూర్తిచేశారు. నేడు […]
హైదరాబాద్ లో ఈ మధ్య మాదాపూర్ లో జరిగిన కాల్పుల కలకలం మరువకముందే మరో చోట కాల్పుల కలకలం రేగింది. నల్గొండ జిల్లా మునుగోడులో కాల్పులు కలకలం సృష్టించాయి. మునుగోడు మండలం ఊకొండి గ్రామం వద్ద బైకుపై వెళ్తున్న ఓ వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపారు. 3 రౌండ్లు కాల్పులు జరపడంతో తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామానికి […]