ఈ ప్రపంచంలో ఈజిప్టు మమ్మీల గురించి తెలియని వాళ్లు ఉండరు. ఈజిప్టు మమ్మీలకు వేల ఏళ్ల చరిత్ర ఉంది. అంతేకాదు! ఒక్కో మమ్మీకి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఇప్పటివరకు ఈజిప్టులోని పలు చోట్ల కొన్ని వందల సంఖ్యలో మమ్మీలను కనుగొన్నారు. తాజాగా కూడా కొన్ని మమ్మీలను తవ్వకాల్లో వెలికి తీశారు. ఆ మమ్మీలు పురావస్తు శాస్త్రవేత్తలతో పాటు సామాన్య జనాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఎందుకంటే.. వాటి నోట్లోని నాలుకలు బంగారంతో చేయబడి ఉన్నాయి. సెంట్రల్ నైలు డెల్టాలోని కువేశ్నా […]
మమ్మీలను మ్యూజియంలో చూడ్డం ఆసక్తిగానే ఉంటుంది. ఏళ్ల నాటి చక్రవర్తి లేదా మహారాణ చనిపోయినా కూడా చెక్కు చెదరకుండా ఒక అద్దాల పెట్టె లోపలి నుంచి వెల్లకిలా పడుకుని కనిపిస్తున్నప్పుడు వేల ఏళ్ల నాటి ఆ కాలమే ఇప్పుడు మన కళ్ల ముందు ప్రయాణిస్తున్నట్లుగా ఉంటుంది. పద్దెనిమిది మంది మహారాజులు, నలుగురు మహారాణులు ఒకరి వెంట ఒకరు సెంట్రల్ కైరోలోని ‘ఈజిప్షియన్ మ్యూజియం’ నుంచి బయల్దేరి అక్కడి సమీపంలోనే ఉన్న ‘నేషనల్ మ్యూజియం ఆఫ్ ఈజిప్షియన్’లో ‘సందర్శకుల […]