ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ వేడి రోజురోజుకు పెరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ గురువారం 125 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో 40 శాతం సీట్లను మహిళలకు కేటాయించారు. ఈ నేపథ్యంలో మీరట్‌లోని హస్తినాపూర్ అసెంబ్లీ స్థానానికి మిస్ బికినీ 2018 అయిన అర్చన గౌతమ్‌ను కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఎంపిక చేశారు. ఆమెకు కాంగ్రెస్ టికెట్ ప్రకటించిన కొద్దిసేపటికే కొందరు సోషల్ మీడియాలో ఆమెను […]