భారతదేశానికి స్వాతంత్ర్యం లభించి 75 సంవత్సరాలు కావొస్తున్న తరుణంలో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ వేడుక ఓ ఉద్యమంలా అవతరించిందని ప్రధాని మోదీ అభిప్రాయ పడ్డారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల గురించి ప్రస్తావించారు. అంతేకాకుండా ఆగస్టు నెల 2 నుంచి 15 వరకు ప్రతి ఒక్కరూ తమ సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్ పిక్ గా జాతీయ జెండాను ఉంచాలని పిలుపునిచ్చారు. […]
ప్రతి నెల రేడియో కార్యక్రమం మన్ కి బాత్ లో ప్రధాని మాట్లాడే సంగతి అందరికి తెలిసిందే. ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో అనేక విషయాలను ప్రస్తావిస్తుంటారు ప్రధాని మోదీ. ఈనెల మాట్లాడిన మన్ కీ బాత్ కార్యక్రమంలో జల సంరక్షణ గురించి ప్రస్తావించారు. “ప్రతి నీటి బొట్టు విలువైనది.. భవిష్యత్తు తరాల కోసం నీటిని పొదుపు చేయాలి. నీటి రీసైక్లింగ్ పై మనం దృష్టి పెట్టాలి” అని ప్రధాని మోదీ అన్నారు. ఈ సందర్భంగా […]
మన్ కీ బాత్.. ప్రధాని నరేంద్ర మోడీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో చెప్పుకునే కార్యక్రమం. 2014 నుంచి ప్రారంభమైన ఈ ప్రసార కార్యక్రమం ఇప్పటికి 78 ఎపిసోడ్ లను పూర్తి చేసుకుంది. ప్రతి నెల చివరి ఆదివారం రోజున ప్రధాని మన్ కీ బాత్ ప్రోగ్రాంని నిర్వహిస్తారు. రాజకీయ, ఆర్థిక, సామజిక, సమకాలీన అంశాలపై ప్రధాని మన్ కీ బాత్ ద్వారా తన మనోభావాలను వ్యక్తపరుస్తాడు. ఈ ప్రోగ్రాం ప్రతినెల ప్రసారభారతిలో ప్రసారమౌతోంది. ఇక […]
స్వతంత్ర భారతదేశంలో అందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ఇక సామాన్యులకే ఈ అధికారం ఉంటే.., ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రధానిని కనీసం ప్రశ్నించే రైట్ ఉండదా? కచ్చితంగా ఉంటుంది. ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ ఇలాగే కేంద్ర ప్రభుత్వ తీరుపై తన నిరసనని ట్విట్టర్ వేదికగా తెలియ చేశారు. “గౌరవనీయ ప్రధాన మంత్రి మోదీ ఈ రోజు నాకు ఫోన్ చేశారు. ఆయన మనసులో ఉన్నది మాత్రమే నాతో మాట్లాడారు. చేయాల్సిన పని గురించి మాట్లాడినా, […]