మన్ కీ బాత్.. ప్రధాని నరేంద్ర మోడీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో చెప్పుకునే కార్యక్రమం. 2014 నుంచి ప్రారంభమైన ఈ ప్రసార కార్యక్రమం ఇప్పటికి 78 ఎపిసోడ్ లను పూర్తి చేసుకుంది. ప్రతి నెల చివరి ఆదివారం రోజున ప్రధాని మన్ కీ బాత్ ప్రోగ్రాంని నిర్వహిస్తారు. రాజకీయ, ఆర్థిక, సామజిక, సమకాలీన అంశాలపై ప్రధాని మన్ కీ బాత్ ద్వారా తన మనోభావాలను వ్యక్తపరుస్తాడు. ఈ ప్రోగ్రాం ప్రతినెల ప్రసారభారతిలో ప్రసారమౌతోంది.
ఇక మరో విషయం ఏంటంటే..మన్ కీ బాత్ సమాచారాన్ని అందించటంతో పాటు కాసిన్ని కాసులు కూడా సంపాదించి పెట్టిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అవును.. 2014 నుంచి ప్రారంభమైన ఈ ప్రసారానికి ఇప్పటి వరకు అక్షరాల రూ. 30.80 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. ఈ విషయాన్ని సోమవారం కేంద్ర సమాచార మరియు ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ రాజ్యసభలో తెలియజేశారు. ఇక ఇప్పటి వరకు ఈ 78 ఎపిసోడ్ లు విజయవంతంగా పూర్తి చేసుకుంది మన్ కీ బాత్.
అత్యధికంగా 2017-18 మధ్య కాలంలోనే రూ. 10.64 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు అనురాగ్ ఠాకూర్. ఇదిలా ఉంటే 2014-15 లో రూ. 1.16 కోట్లు, 2015-16 లో రూ. 2.81 కోట్లు, 2016-17 లో రూ. 5.14 కోట్లు, 2018-19 లో రూ. 7.47, 2019-20 లో రూ. 2.56 కోట్లు వచ్చినట్లు ప్రకటించారు. ఇక 2020-21 లో 1.02 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు అనురాగ్ ఠాకూర్. ఇక ఈ ఎపిసోడ్ లను దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డీటీహెచ్, మారియు 91 శాటిలైట్ ఛానల్ ద్వారా ప్రసారం అవుతుంది మన్ కీ బాత్.