భారతదేశానికి స్వాతంత్ర్యం లభించి 75 సంవత్సరాలు కావొస్తున్న తరుణంలో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ వేడుక ఓ ఉద్యమంలా అవతరించిందని ప్రధాని మోదీ అభిప్రాయ పడ్డారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల గురించి ప్రస్తావించారు. అంతేకాకుండా ఆగస్టు నెల 2 నుంచి 15 వరకు ప్రతి ఒక్కరూ తమ సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్ పిక్ గా జాతీయ జెండాను ఉంచాలని పిలుపునిచ్చారు.
ఆగస్టు 2న జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి అని గుర్తు చేశారు. అందుకే అప్పటి నుంచే ప్రొఫైల్ పిక్ గా త్రివర్ణ పతాకాన్ని ఉంచాలని ప్రజలను కోరారు. అంతేకాకుండా ఆగస్టు 13 నుంచి 15 వరకు ఇంటింటా మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని ప్రధాని కోరారు. అలా చేయడం వల్ల ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలన్నారు.
Under the Azadi Ka Amrit Mahotsav, from the 13th to the 15th of August, a special movement – ’Har Ghar Tiranga’ is being organised.
Let us further this movement by hoisting the National Flag at our homes. #MannKiBaat pic.twitter.com/NikI0j7C6Z
— PMO India (@PMOIndia) July 31, 2022
అన్ని వర్గాల వారు ఈ ఉత్సవాల్లో భాగం అవుతున్నారని తెలిపారు. కర్ణాటకలో చేస్తున్న ‘అమృత భారతి కన్నడర్తి’ కార్యక్రమం, స్వాతంత్ర్యంలో రైల్వేల ప్రాముఖ్యతను వివరిస్తూ చేస్తున్న ‘ఆజాదీ కా రైల్ గాడీ’ వంటి ప్రత్యేక కార్యక్రమాలను ప్రధాని మోదీ మన్ కీ బాత్ లో ప్రస్తావించారు. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Glad that the Azadi Ka Amrit Mahotsav is taking the form of a mass movement.
People from all walks of life and from every section of the society are participating in different programmes across the country. #MannKiBaat pic.twitter.com/eJWpHBXi5P
— PMO India (@PMOIndia) July 31, 2022