దేశంలో రాజకీయాలు కుల, మతాలతో ముడిపడి ఉన్నాయి. కొంత మంది రాజకీయ లబ్ది కోసం భగవంతుడ్ని ఇందులోకి లాగేస్తుంటారు. దేవుళ్ల పేరు చెబుతూ ఓటర్లకు గాలం వేస్తుంటారు. ఇవన్నీ గతం నుండి జరుగుతూ ఉన్నవే. అయితే దేశంలో హిందువుల మెజార్టీ ఉన్న నేపథ్యంలో రాజకీయాలన్నీ హిందూ దేవుళ్ల చుట్టూనే తిరుగుతున్నాయి. అయోధ్య రాముని వివాదం ఎన్ని ఏళ్లు కోర్టులో నలిగిన సంగతి విదితమే. అయితే రాముడి పేరుతో అధికార పార్టీ రాజకీయం చేస్తుండటంపై నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్తుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ మధ్యకాలంలో ఎలాంటి అంచనాలు, హైప్ లేకుండా వస్తున్న సినిమాలే భారీ విజయాలను నమోదు చేస్తున్నాయి. స్టార్డమ్ ని కాకుండా కంటెంట్ ప్రధానంగా సినిమాలు తీసి.. పాన్ ఇండియాను ఎలా షేక్ చేయాలో ప్రూవ్ చేసిన చిన్న సినిమాలు ఉన్నాయి. రీసెంట్ గా అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద వందకోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టిన తెలుగు సినిమా ‘కార్తికేయ 2‘. యువహీరో నిఖిల్ – డైరెక్టర్ చందూ మొండేటి కాంబినేషన్ లో కార్తికేయకు సీక్వెల్ గా […]
‘హిందూ- ముస్లిం భాయీభాయీ’.. మనదేశంలో సుపరిచితమైన నానుడి… మత సామరస్యానికి మన దేశం ప్రతీకగా నిలుస్తోంది. ఓ ముస్లిం కుటుంబం పెద్ద మనసు చేసుకొని మత సామరస్యాన్ని చాటుకున్నారు. పదిమందికి పనికొచ్చే పనిచేయడానికి ఏ మతమూ అడ్డురాదని ఆ ఇంటి పెద్ద నిరూపించారు. తన సొంత డబ్బులతో పాటు చందాలు పోగుచేసి తన గ్రామంలోని హిందువుల కోసం రాముల వారి గుడిని నిర్మించారు. తెలంగాణ ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బూడిదంపాడులో మతసామరస్యం వెల్లివిరిసింది. వివరాల్లోకి వెళితే.. […]