దేశంలో రాజకీయాలు కుల, మతాలతో ముడిపడి ఉన్నాయి. కొంత మంది రాజకీయ లబ్ది కోసం భగవంతుడ్ని ఇందులోకి లాగేస్తుంటారు. దేవుళ్ల పేరు చెబుతూ ఓటర్లకు గాలం వేస్తుంటారు. ఇవన్నీ గతం నుండి జరుగుతూ ఉన్నవే. అయితే దేశంలో హిందువుల మెజార్టీ ఉన్న నేపథ్యంలో రాజకీయాలన్నీ హిందూ దేవుళ్ల చుట్టూనే తిరుగుతున్నాయి. అయోధ్య రాముని వివాదం ఎన్ని ఏళ్లు కోర్టులో నలిగిన సంగతి విదితమే. అయితే రాముడి పేరుతో అధికార పార్టీ రాజకీయం చేస్తుండటంపై నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్తుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశ రాజకీయాలన్నీ కుల, మతాలు చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ రెండు లేకుండా రాజకీయం లేదు. తమ లబ్ది కోసం భగవంతుడ్ని మిళితం చేస్తుంటారు మన రాజకీయ నేతలు. దేవుడ్నిరాజకీయాల్లోకి లాగడం కొత్తేమీ కాదూ. ప్రజాస్వామ పాలన దేశంగా భారత్ ఏర్పడిన నాటి నుండి జరుగుతున్నవే. బాబ్రీ మసీదు- అయోధ్య నుండి మొన్నటి జానవాపి వరకు కూడా వీటి చుట్టూనే తిరుగుతున్నాయి. బాబ్రీ మసీదులో రాముడు ఉన్నాడని, తాజ్ మహాల్ కింద హిందు దేవుళ్ల అనవాళ్లున్నాయని, జ్ఞానవాపి మసీదులో కూడా శివలింగం కనిపించిందంటూ పలు వివాదాలు వెలుగులోకి వచ్చాయి. వీటిలో బాబ్రీ మసీదు-అయోధ్య కేసు తేలింది. ఇంకొన్ని కోర్టు విచారణలో ఉన్నాయి. సమస్యను కానీదాన్ని సమస్యగా సృష్టించి, ప్రజలను ప్రశ్నించే తత్వం నుండి మరల్చడమే నేతల ఎత్తుగడ. ఎక్కువగా దేశంలోని అధికార పార్టీ హిందూ దేవుళ్లను ముఖ్యంగా రాముని పేరును ఎక్కువగా వినియోగించి రాజకీయ లబ్ది పొందుతుందని విపక్షాల వాదన.
తాజాగా దీనిపై ప్రస్తుత కేంద్ర పాలిత ప్రాంతం , ఒకప్పటి రాష్ట్రం జమ్ముకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడుతూ.. రాముడు కేవలం హిందువులకే దేవుడు కాదని, అందరి దేవుడని వ్యాఖ్యానించారు. రామునికి మతంతో సంబంధం లేదని, ఆయనపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికీ ఆయన దేవుడేనంటూ వ్యాఖ్యానించారు. బీజెపీ అధికారంలోకి వచ్చేందుకు మాత్రమే ఆయన పేరును వినియోగించుకుంటుందని అన్నారు. ‘ భగవాన్ రామ్ హిందువులకు మాత్రమే దేవుడు కాదూ. దయచేసి ఈ భావనను మీ మనస్సులో నుండి తొలగించండి. ఆయన ప్రతి ఒక్కరికి దేవుడు. ముస్లిం, క్రిస్టియన్, అమెరికన్, రష్యన్.. ఎవరైనా సరే ఆయనపై విశ్వాసం ఉంచేవారెవరికైనా ఆయన దేవుడే’ అని ఓ ర్యాలీలో అన్నారు. అయితే రాముడు అందరికీ దేవుడు అని ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యలు చేయడం ఇదేమీ కొత్త కాదు. గతంలో కూడా ఆయన ఇటువంటి వ్యాఖ్యలే చేశారు
రాముని శిష్యులం అని మీ వద్దకు వచ్చే వారంతా మూర్ఖులని, ఆయన పేరును వాడుకుంటున్నారని బీజేపీ నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. జమ్ముకాశ్మీర్‌లో ఎన్నికలను ప్రకటించే సమయానికి ప్రజల దృష్టిని మరల్చేందుకు రామ మందిరాన్ని ప్రారంభిస్తారని అనుకుంటున్నానని తెలిపారు. బీజేపీయేతర పార్టీల మధ్య ఐక్యతపై మాట్లాడుతూ..తమకు ఎలాంటి అడ్డంకులు లేవన్నారు. అదీ కాంగ్రెస్సా, ఎన్సీనా అనేది తేదన్నారు. మేము ప్రజల కోసం పోరాడతామని, వారి కోసం అవసరమైతే చనిపోతామని, అయితే మనమదరం ఐక్యంగా ఉండాలన్నారు. ఎన్నికల సమయంలో హిందువులు ప్రమాదంలో ఉన్నారంటూ ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తారని, ఆ మాయ మాటల్లో పడిపోవద్దని అభ్యర్థించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఇవిఎం)ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Shame on Harsh Dev for joining hands with anti-Jammu anti-Dogra anti-Hindu Farooq Abdullah.
Faroow said “Bhagwan Ram was sent by Allah and those who worship Ram are fools”
How dare he made such a stupid statement amidst Dogras of Jammu?
Shame on these sellouts of Jammu. pic.twitter.com/xhRHHxxKQ0— Neeraj 🇮🇳 🇺🇸 (@nsb1080) March 24, 2023