కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు తరచూ వార్తల్లో నిలిస్తుంది. రెండు రోజుల క్రితం కోమటిరెడ్డి మాట్లాడినట్లు ఒక వీడియో కలకలం రేపుతోంది. టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్‌తో పాటు ఆయన కుమారుడు సుహాస్‌ను తన అభిమానులు చంపుతారంటూ బెదిరిస్తున్నట్టుగా ఉన్న ఆడియో లీక్ కలకలం రేపింది. తాజాగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కేసు నమోదైంది.
కాంగ్రెస్ లో ఎప్పుడు.., ఎవరికి పదవులు దక్కుతాయో, ఎవరికి ప్రాధాన్యత దక్కదో చెప్పడం చాలా కష్టం. ముప్పై ఏళ్లుగా పార్టీనే నమ్ముకుని ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకవైపు, నిన్న కాక మొన్న కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి ఒకవైపు. కానీ.., కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిపై నమ్మకం ఉంచింది. తెలంగాణ పీసీసీ చీఫ్ పీఠాన్ని రేవంత్ రెడ్డిని వరించింది. కాంగ్రెస్ లో పొలిటికల్ క్యాలిక్యులేషన్స్ ఇలానే ఉంటాయి. రేవంత్ రెడ్డి ఛరీష్మా ఉన్న నేత. గత […]