కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు తరచూ వార్తల్లో నిలిస్తుంది. రెండు రోజుల క్రితం కోమటిరెడ్డి మాట్లాడినట్లు ఒక వీడియో కలకలం రేపుతోంది. టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్‌తో పాటు ఆయన కుమారుడు సుహాస్‌ను తన అభిమానులు చంపుతారంటూ బెదిరిస్తున్నట్టుగా ఉన్న ఆడియో లీక్ కలకలం రేపింది. తాజాగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కేసు నమోదైంది.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు తరచూ వార్తల్లో నిలిస్తుంది. గత కొన్నిరోజులుగా సొంత పార్టీలో ఆయన ఉండే తీరు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. అయితే రెండు రోజుల క్రితం కోమటిరెడ్డి మాట్లాడినట్లు ఒక వీడియో కలకలం రేపుతోంది. దీనిలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వాయిస్‌గా వినిపిస్తున్న ఒక ఫోన్ కాల్ రికార్డింగ్.. కాంగ్రెస్‌లోనే కాక రాష్ట్ర రాజకీయాల్లో కూడా పెను సంచలనంగా మారింది. టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్‌తో పాటు ఆయన కుమారుడు డాక్టర్ చెరుకు సుహాస్‌ను తన అభిమానులు చంపుతారంటూ బెదిరిస్తున్నట్టుగా ఉన్న ఆడియో లీక్ కలకలం రేపింది. తాజాగా ఈ ఘటనపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై నల్గొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. చెరుకు సుధాకర్ కు బెదిరింపులు రావడంపై ఆయన కొడుకు చెరుకు సుహాస్ సోమవారం నల్గొండ ఎస్సీకి ఫిర్యాదు చేశారు. తన తండ్రి సుధాకర్ ను చంపుతానంటూ కోమటిరెడ్డి ఫోన్ లో బెదిరించాడని సుహాస్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డితో తమ ప్రాణాలకు ముప్పు ఉందని చెరకు సుహాస్ ఫిర్యాదు చేశాడు. సుహాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిపై నల్గొండ లోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఐపీసీ సెక్షన్ 506 కింద కేసు నమోదైంది.
వైరల్ అవుతున్న ఆడియోలో చెరుకు సుధాకర్ కి కోమటి రెడ్డి వార్నింగ్ ఇచ్చినట్లు ఉంది. తనపై విమర్శలు మానుకోవలని, తన అభిమానులు కార్యకర్తలు చెరుకు సుధాకర్ ను చంపేందుకు కార్లలో తిరుగుతున్నారని బెదిరించినట్లు ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఆడియో లీక్ పై చెరుకు సుధాకర్ రెడ్డి వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఆడియో సంభాషణపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. భావోద్వేగంతోనే తాను ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.
ఈ విషయానికి ఇక్కడితో పుల్ స్టాప్ పెట్టాలని చెరుకు సుధాకర్ ను వెంకట్ రెడ్డి కోరారు. తన కొడుకుకు ఫోన్ చేసి వెంకట్ రెడ్డి బెదిరింపులకు పాల్పడడంపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘానికి చెరుకు సుధాకర్ ఫిర్యాదు చేశారని సమాచారం. అంతేకాదు రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలకు చెరుకు సుధాకర్ లేఖ రాశారని తెలుస్తోంది. తాజాగా తమకు వస్తున్న బెదిరింపులపై చెరుకు సుధాకర్ కొడుకు సుహస్ లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరి.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కేసు నమోదు కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.