ఒక సినిమా తీసే ముందు ఆ కథ అనేక మంది వద్దకు వెళ్తుంది. వాళ్ళు రిజెక్ట్ చేస్తే ఫైనల్ గా ఒకరి దగ్గరకు వెళ్తుంది. ఆ తర్వాత సినిమా మిస్ అయ్యామని చాలా బాధపడతారు. డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల, కథ నచ్చకపోవడం వల్ల సినిమాలు మిస్ చేసుకుంటారు కొంతమంది. తాజాగా నటి ప్రేమ కూడా అరుంధతి సినిమా ఛాన్స్ ని మిస్ చేసుకున్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో కోడి రామకృష్ణ ఎన్నో వైవిధ్యభరితమైన చిత్రాలు తెరెక్కించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. టాలీవుడ్లో చరిత్రలో రామకృష్ణ రచయితగా, దర్శకుడిగా తన మార్క్‌ను లికించుకున్నాడు. భక్తిభావంతో నిండిన సినిమాలు తీయాలంటే రామకృష్ణ తర్వాతే ఎవరైన అనేలా నిలిచిపోయాడు. తెలుగులో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అనే చిత్రంతో దర్శకుడిగా మారాడు. అనంతరం దేవి, దేవిపుత్రుడు, దేవుళ్లు, అంజి, అరుంధతి వంటి విభిన్నసినిమాలు చేసి అనేక విజయాలను సాధించాడు ఈ దర్శకుడు. వందకు […]