ఒక సినిమా తీసే ముందు ఆ కథ అనేక మంది వద్దకు వెళ్తుంది. వాళ్ళు రిజెక్ట్ చేస్తే ఫైనల్ గా ఒకరి దగ్గరకు వెళ్తుంది. ఆ తర్వాత సినిమా మిస్ అయ్యామని చాలా బాధపడతారు. డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల, కథ నచ్చకపోవడం వల్ల సినిమాలు మిస్ చేసుకుంటారు కొంతమంది. తాజాగా నటి ప్రేమ కూడా అరుంధతి సినిమా ఛాన్స్ ని మిస్ చేసుకున్నారు.
అనుష్క కెరీర్ లోనే అతి పెద్ద హిట్ గా నిలిచిన సినిమా అరుంధతి. ఈ సినిమా అనుష్కలో దాగి ఉన్న నట బీభత్సాన్ని బయటపెట్టింది. అయితే ఈ సినిమాలో నటించే అవకాశం అనుష్క కంటే ముందు ఇద్దరు హీరోయిన్స్ కి వచ్చింది. వారిలో మమతా మోహన్ దాస్ ఒకరు కాగా మరొకరు ప్రేమ. అరుంధతి పాత్రలో నటించే అవకాశం తనకు వచ్చిందని మమతా మోహన్ దాస్ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈమె ఒప్పుకోకపోవడంతో అనుష్కకు వెళ్లిందని, ఆ తర్వాత సినిమా మిస్ చేసుకున్నందుకు చాలా బాధపడ్డానని తెలిపింది. తాజాగా మమతా మోహన్ దాస్ లానే ప్రేమ కూడా ఈ సినిమా అవకాశాన్ని చేజార్చుకున్నట్లు నటి ప్రేమ వెల్లడించారు.
కోరుకున్న ప్రియుడు, ఓంకారం, దేవి, ఉపేంద్ర వంటి సినిమాలతో తనదైన నటనతో అలరించిన నటి ప్రేమ. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన దేవి సినిమాతో మరింత స్టార్ డమ్ తెచ్చుకున్నారు. అప్పట్లో ప్రేమ అందానికి కుర్రాళ్ళు పిచ్చెక్కిపోయేవారు. అంత అందంగా ఉండేవారు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ప్రేమ కన్నడ, మలయాళ, తెలుగు భాషల్లో అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. ఆ తర్వాత హీరోయిన్ గా ఫేడవుట్ అవ్వడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడ్డారు. తాజాగా సుమన్ టీవీతో ఆమె ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె అరుంధతి సినిమా మిస్ చేసుకున్న విషయాన్ని వెల్లడించారు. తనకు కోడి రామకృష్ణతో తనకు మంచి అనుబంధం ఉందని.. దేవి సినిమా షూటింగ్ సమయంలో ఆయన తనకు తెలుగు నేర్పించారని అన్నారు.
అరుంధతి సినిమా షూటింగ్ మొదలు పెట్టక ముందు అరుంధతి పాత్ర కోసం తనను సంప్రదించారని.. అయితే అప్పటికే తాను కానంద సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నానని.. డేట్స్ సర్దుబాటు కాక అవకాశాన్ని వదులుకున్నానని ఆమె వెల్లడించారు. సినిమా విడుదలైన తర్వాత చూశానని, చాలా అద్భుతంగా ఉందని ఆమె అన్నారు. అయితే సినిమా మిస్ చేసుకున్నందుకు తాను ఏ మాత్రం బాధపడలేదని, అనుష్కకు అదృష్టం ఉంది కాబట్టి అవకాశం తనను వరించిందని అన్నారు. మరి ప్రేమ కనుక అరుంధతి సినిమా చేసి ఉంటే ఫలితం ఎలా ఉండేది? అనుష్క స్థాయిలో ప్రేమ ఇమేజ్ పెరిగేదా? మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.