దేశంలో కరోనా మహమ్మారిని విజృంభణ రోజురోజుకి పెరుగుతూనే ఉంది. దీనితో.. రాష్ట్ర ప్రభుత్వాలు నిదానంగా లాక్ డౌన్ వైపే అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగానే.. తెలంగాణలో ఈ బుధవారం నుండి రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. ఉదయం గం.10 వరకు అన్నీ కార్యక్రమాలు యధావిధిగా చేసుకోవచ్చని తెలియచేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని మందు బాబులు మద్యం షాపుల వద్ద బారులు తీరారు. లాక్డౌన్ ప్రకటనతో మద్యం దుకాణాలు కిక్కిరిసిపోయాయి. మద్యం కోసం పలు వైన్షాపుల వద్ద […]
హైదరాబాద్- తెలంగాణలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా పనిచేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిపై పని ఒత్తిడి తగ్గించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు స్వల్ప సమయం కోసం తాత్కాలిక ప్రాతిపదికన వైద్య సిబ్బందిని నియమించుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీబీఎస్ విద్యను పూర్తి చేసిన అర్హులైన యువ వైద్యుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి ఆదివారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మూడు […]
హైదరాబాద్- తెలంగణలో లాక్‌డౌన్ విధించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చి చెప్పారు. దీంతో రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తారన్న ప్రచారానికి తెర పడింది. తెలంగాణలో కరోనా కేసులను నిరోధించడానికి లాక్ డౌన్ ఏ మాత్రం పరిష్కారం కాదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్ వల్ల ఆర్థికవ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ఇతర రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించినా కరోనా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదని, అంతే కాకుండా లాక్ డౌన్ వల్ల జనజీవనం స్థంభించిపోతుందని […]
హైదరాబాద్- ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ను ఆశాఖ నుంచి తప్పించిన వెను వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగారు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై ఆయన ఆరా తీశారు. కరోనా విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులకు చెప్పారు. ప్రతిరోజూ మూడు సార్లు రివ్యూ నిర్వహించి స్వయంగా పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రెమ్‌డెసివర్, వాక్సీన్, ఆక్సీజన్, ఆస్పత్రుల్లో బెడ్ల విషయంలో గానీ ఏ మాత్రం లోపం రానీయవద్దని […]