దేశంలో కరోనా మహమ్మారిని విజృంభణ రోజురోజుకి పెరుగుతూనే ఉంది. దీనితో.. రాష్ట్ర ప్రభుత్వాలు నిదానంగా లాక్ డౌన్ వైపే అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగానే.. తెలంగాణలో ఈ బుధవారం నుండి రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. ఉదయం గం.10 వరకు అన్నీ కార్యక్రమాలు యధావిధిగా చేసుకోవచ్చని తెలియచేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని మందు బాబులు మద్యం షాపుల వద్ద బారులు తీరారు. లాక్డౌన్ ప్రకటనతో మద్యం దుకాణాలు కిక్కిరిసిపోయాయి. మద్యం కోసం పలు వైన్షాపుల వద్ద తోపులాటలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల ఇప్పటికే వైన్ షాపులు నో స్టాక్ బోర్డులు పెడుతున్నాయి. టోలిచౌకి, గోల్కొండ, లంగర్ హౌస్ తదితర ప్రాంతాల్లో లిక్కర్ షాపుల వద్ద జనాల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఇప్పటికే నో స్టాక్ బోర్డ్స్ తగిలించేశారు.
10రోజుల పాటు లాక్ డౌన్ కొనసాగనుండటంతో మందు బాబులు మందు జాగ్రత్త చర్యలకు దిగారు. ఈ క్రమంలోనే ఒక్కొక్కరు 10 రోజులకి సరిపోయే లిక్కర్ ని కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో మద్యం షాప్స్ ముందు కిలో మీటర్ మేర క్యూ లైన్స్ దర్శనం ఇస్తున్నాయంటే మందు బాబులు ఏ రేంజ్ లో రెచ్చిపోయారో అర్ధం చేసుకోవచ్చు. వీరిలో ఎవ్వరూ కూడా కోవిడ్ నిబంధనలను పాటించకుండానే క్యూ లైన్స్ లో మద్యం కొనుగోళ్ళకి ఎగబడతుండటం విచారించతగ్గ విషయం. ఇక లిక్కర్ షాప్స్ గాని, బార్ అండ్ రెస్టారెంట్స్ గాని ఉదయం 10 లోపల తెరవకూడదని అబ్కారీ శాఖ అధికారులు ఇప్పటికే ఓ జీవోని విడుదల చేసి ఉన్నారు. లాక్ డౌన్ లో అన్నీ కార్యక్రమాలకి పర్మిషన్ ఉన్నది 10 గంటల వరకే. దీనితో లాక్ డౌన్ 10 రోజులు మందు దొరకదన్న కారణంగానే మందుబాబులు ఇలా షాప్స్ ముందు బారులు తీరినట్టు తెలుస్తోంది.