ఏదైనా సినిమాలోని పాటలు ఫేమస్ అయితే చాలు.. వాటికి డ్యాన్స్ చేస్తూ, సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు పలువురు. దీనికి సెలబ్రిటీలేమీ అతీతం కాదూ. సీరియల్స్ యాక్టర్స్ దగ్గర నుండి సినిమా హీరో హీరోయిన్ల వరకు ఫేమస్ పాటలకు డ్యాన్సులు వేస్తున్నవారే. రీల్స్, షాట్స్ రూపంలో వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఓ కలెక్టర్ ఓ ఫేమస్ సాంగ్ కు డ్యాన్స్ చేసి అబ్బురపరిచారు.
మాములుగా కాలేజీలో కానీ, స్కూల్లో కానీ సెలవు కావాలంటే ముందుగా క్లాస్ టీచర్ కు ఓ దరఖాస్తు ద్వారా సెలవును కోరతాం. కానీ అలా కాకుండా కొందరు విద్యార్థులు మాత్రం.. ఏకంగా జిల్లా కలెక్టర్ కు ఫొన్ ద్వారా సెలవు కావాలంటూ మెసేజ్ పంపారు. అలా ఒకరు కాదు, ఇద్దరు కాదు.., చాలామంది విద్యార్థులు సెలవు కోసం ఆమెకు ఫిర్యాదులు చేశారు. విద్యార్థుల నుంచి అలా వచ్చిన మెసేజ్ లను చూసిన కలెక్టర్ ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. […]