మాములుగా కాలేజీలో కానీ, స్కూల్లో కానీ సెలవు కావాలంటే ముందుగా క్లాస్ టీచర్ కు ఓ దరఖాస్తు ద్వారా సెలవును కోరతాం. కానీ అలా కాకుండా కొందరు విద్యార్థులు మాత్రం.. ఏకంగా జిల్లా కలెక్టర్ కు ఫొన్ ద్వారా సెలవు కావాలంటూ మెసేజ్ పంపారు. అలా ఒకరు కాదు, ఇద్దరు కాదు.., చాలామంది విద్యార్థులు సెలవు కోసం ఆమెకు ఫిర్యాదులు చేశారు. విద్యార్థుల నుంచి అలా వచ్చిన మెసేజ్ లను చూసిన కలెక్టర్ ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. ఇక ఇంతటితో ఆగకుండా అలా వారు చేసిన వారి మెసేజ్ లను స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీనిని సంబంధించిన ఫొటోలు కాస్త వైరల్ గా మారుతున్నాయి.
అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఆ కలెక్టర్ ఎవరు అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మదురైలో జన్మించిన కవిత రాము వృత్తిరీత్యా నృత్యకారిణి. కానీ ఉన్నత చదువులు చదివిన కవిత రాము ప్రస్తుతం తమిళనాడులోని పుద్దుకొట్టై జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్నారు. అయితే కవిత రాము సోషల్ మీడియా తెగ యాక్టివ్ గానే ఉంటారు. సోషల్ మీడియాలో ఆమెకు 25 వేల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ప్రతీది సోషల్ మీడియాలో పంచుకుంటూ ముందుకువెళ్తున్నారు. అయితే బుధవారం ఆమెకు వచ్చిన మెసేజ్, ఫిర్యాదులను అందరితో పంచుకునే ప్రయత్నం చేసింది.
ఇటీవల జిల్లాలోని కొందరు విద్యార్థులు మాకు సెలవులు కావాలని ఏకంగా కలెక్టర్ కవిత రాముకు మెసేజ్ లు పంపారు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు.., చాలా మంది విద్యార్థులు సెలవులు కావాలంటూ ఫిర్యాదులు చేశారు. ఒక విద్యార్థి అయితే.. మేడం మాకు ఒక రోజు స్కూలుకు సెలవు కావాలి. మీరు సెలవు ప్రకటించకపోతే.. మేము మానసికంగా చాలా బాధపడతాం అంటూ రాసుకొచ్చారు. ఇక మరో విద్యార్థి అయితే.. మాకు రేపు ఒక్కరోజు మాత్రమే సెలవును కోరుతున్నాం, ఇలా ఎప్పుడూ కోరడం లేదంటూ ఫిర్యాదు చేశారు. ఇంజనీరింగ్ చదివే ఓ విద్యార్థి.. నేను మా స్వగ్రామనికి వచ్చాను. వర్షం బాగా పడుతుంది, తిరిగి రాలేకపోతున్నాను, అందుకే ఒక రోజు సెలవు ఇవ్వండి మేడం అంటూ మెసెజ్ లు పెట్టారు. ఇలా విద్యార్థులు పంపిన ఆ మెసెజ్ లు కలెక్టర్ కవిత రాము సోషల్ మీడియాలో పంచుకోవడంతో కాస్త వైరల్ గా మారుతుంది.