ఎంఎల్ఎ రాజయ్య జానకీపురం సర్పంచ్ నవ్యకు మధ్య వివాదం అనూహ్య మలుపులు తిరుగుతోంది. తనపై ఆరోపణలు చేసిన నవ్యపై ఎంఎల్ఎ రాజయ్య పరోక్షంగా సవాల్ విసిరారు. పరువు నష్టం దావా వేస్తానంటూ ఛాలెంజ్ చేశారు.
Rajaiah: టీఆర్‌ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తనపై చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రాజయ్య మండిపడ్డారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం తన అడ్డా అని అన్నారు. కడియం శ్రీహరి దళిత దొర అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియా ప్రతినిధులు ఏర్పాటు చేసిన సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ.. ‘‘ కడియం శ్రీహరి నామీద చేసిన అభియోగాలను తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ రోజు మాటిమాటికి గురివింద సామెతలెక్క..దొంగే, దొంగ దొంగ అన్నట్లు.. మాట్లాడితే అవినీతి […]