ఎంఎల్ఎ రాజయ్య జానకీపురం సర్పంచ్ నవ్యకు మధ్య వివాదం అనూహ్య మలుపులు తిరుగుతోంది. తనపై ఆరోపణలు చేసిన నవ్యపై ఎంఎల్ఎ రాజయ్య పరోక్షంగా సవాల్ విసిరారు. పరువు నష్టం దావా వేస్తానంటూ ఛాలెంజ్ చేశారు.
స్టేషన్ ఘన్ పూర్ ఎంఎల్ఎ తాటికొండ రాజయ్య, జానకీపురం సర్పంచ్ నవ్య మధ్య చోటు చేసుకున్న వివాదం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. గతంలో నవ్య ఎంఎల్ఎ రాజయ్యపై లైంగిక ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణలు రాజకీయంగా పెద్ద దుమారం చెలరేగింది. సొంత పార్టీ మొదలు ప్రతిపక్షాల వరకు విమర్శలు గుప్పించారు. దీంతో రాజయ్య నవ్య ఇంటికి వెళ్లి మీడియా సమక్షంలో క్షమాపణలు కోరాడు. ఆ తర్వాత గ్రామాభివృద్థికోసం రూ. 25 లక్షలు ఇస్తానని తెలిపాడు. అయితే డబ్బులు ఇవ్వకుండా గతంలో అప్పు తీసుకున్నట్లు పేపర్ పై సంతకం పెట్టాలని ఒత్తిడి చేస్తున్నట్టు నవ్య మరోసారి ఆరోపణలు గుప్పించింది. తనను వేధించినట్టు ఆడియోలు, వీడియోలు తన వద్ద ఉన్నాయంటూ సర్పంచ్ నవ్య తెలిపింది. ఇదిలా ఉంటే తాజాగా ఎంఎల్ఎ రాజయ్య నవ్య విషయంపై పరోక్షంగా సవాల్ విసిరాడు. ఆడియోలు, వీడియోలు ఉన్నాయని అంటున్న వారికి సవాల్ విసురుతున్న, ఆరోపణలు కోర్టులో ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నానని హాట్ కామెంట్స్ చేశారు.
సర్పంచ్ నవ్య, ఎంఎల్ఎ రాజయ్య మధ్య వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. నవ్య ఆరోపణలపై తాజాగా ఎంఎల్ఎ రాజయ్య పరోక్షంగా స్పందించాడు. తనపై వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రజలను కోరాడు. ఆడియోలు, వీడియోలు ఉన్నాయంటూ బెదిరిస్తున్న వారికి సవాల్ విసురుతున్న, ఆ ఆరోపణలను కోర్టులో ఎదుర్కొంటాను. అవసరమైతే పరువునష్టం దావా వేస్తానని తెలిపారు. తాను ప్రజా జీవితంలో ఉన్నానని, ప్రజా నాయకుడినని ఎంఎల్ఎ రాజయ్య వెల్లడించారు. కాగా ఇటీవల నవ్య, ఎంఎల్ఎ రాజయ్య అతడి అనుచరులపై కేసు నమోదు చేసింది. నవ్య ఆరోపణలను మహిళాకమిషన్లు సుమోటోగా స్వీకరించి దర్యాప్తు చేయాలని పోలీస్ శాఖను ఆదేశించాయి. దీనిలో భాగంగా పోలీసులు కేసుకు సంబంధించిన ఆదారాలు ఇవ్వాలని నవ్యకు నోటీసులు జారీ చేశారు. నవ్య ఆదారాలు సమర్పించకపోవడంతో తన ఆరోపణల్లో నిజం లేదని పోలీసులు మహిళాకమిషన్ కు రిపోర్ట్ అందజేశారు. కేసును క్లోజ్ చేయాలని పోలీసులకు, మహిళా కమిషన్ కు సూచించారు. తాజాగా రాజయ్య చేసిన ఛాలెంజ్ హాట్ టాపిక్ గా మారింది.