Rajaiah: టీఆర్‌ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తనపై చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రాజయ్య మండిపడ్డారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం తన అడ్డా అని అన్నారు. కడియం శ్రీహరి దళిత దొర అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియా ప్రతినిధులు ఏర్పాటు చేసిన సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ.. ‘‘ కడియం శ్రీహరి నామీద చేసిన అభియోగాలను తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ రోజు మాటిమాటికి గురివింద సామెతలెక్క..దొంగే, దొంగ దొంగ అన్నట్లు.. మాట్లాడితే అవినీతి గురించి మాట్లాడుతుంటారు.
నాకు ఆస్తి మొదటి నుంచి ఉంది. మరి, కడియం శ్రీహరి ఎమ్మెల్యేకాక ముందు ఆస్తి ఏంది.. ఇప్పుడు ఆయన ఆస్తి ఏంది. అని బేరీజు వేసుకోవాలి. నీ ఆస్తులన్నీ ఎలా సంపాదించావు. ఆయన గోబెల్స్ ప్రచారం చేస్తున్నాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎవ్వరికీ కూడా దళిత దొర అన్న పేరు లేదు. కడియం శ్రీహరి అవినీతికి పరాకాష్టగా ఆయన పేరుమీద కల్‌నాయక్ అని పుస్తకం కూడా వచ్చింది. స్టేషన్ ఘన్‌పూర్ నా అడ్డా ’’ అని ఆయన అన్నారు. మరి, కడియం శ్రీహరిపై ఎమ్మెల్యే రాజయ్య చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Vinayaka Chavithi 2022: వినాయకచవితి ముందు అద్భుతం! శాస్త్రవేత్తలే నమ్మలేకపొతున్నారు!