రాజకీయం అనేది చదరంగం లాంటిది.. ఎప్పుడు ఏ పార్టీవారు ఏ వ్యూహాన్ని అమలుపరచి అధికారం దక్కించుకునే ప్రయత్నం చేస్తారో ఎవరూ ఊహించలేరు. ఇప్పుడున్న దేశ రాజకీయాల దృష్ట్యా బీజేపీ పార్టీ ఈసారి అన్నివిధాలా పైచేయి సాధించే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఓవైపు తెలంగాణలో అధికారం కోసం ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది బీజేపీ. పాలిటిక్స్ అన్నాక జనాలను అప్రోచ్ అయ్యేందుకు కొన్ని వ్యూహాలుంటాయి. అయితే.. తెలంగాణలో బీజేపీని హైలైట్ చేస్తూ, జనాల దృష్టిలో పడేందుకు ఇప్పుడు సినీ గ్లామర్ […]
దేశంలో రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. అందులోనూ, బీజేపీ ఎత్తుగడలు ఎవరకి అంతుపట్టడం లేదు. ఇటీవలే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలుగు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సినీ నటుడు నితిన్, టీమిండియా మాజీ మహిళా సారధి మిథాలీ రాజ్ తో సమావేశం కానున్నారు. దీని వెనుక బీజేపీ స్ట్రాటజీ ఏంటన్నది అంతుచిక్కడం లేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, […]
Nitin: టాలీవుడ్ హీరో నితిన్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవనున్నారు. శనివారం శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని నోవాటెల్ హోటల్లో నితిన్, జేపీ నడ్డా భేటీ కానున్నట్లు తెలుస్తోంది. నితిన్‌తో పాటు పలువురు రచయితలు, క్రీడాకారులు కూడా జేపీ నడ్డాను కలవనున్నట్లు సమాచారం. రేపు హన్మకొండలో జరగబోయే సభలో పాల్గొనేందుకు నడ్డా హైదరాబాద్ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నితిన్‌తో ఆయన భేటీ కానున్నారట. ఇక, బీజేపీ టాలీవుడ్ హీరోలపై కన్నేసినట్లు కనిపిస్తోంది. మొన్న కేంద్ర హోంశాఖ మంత్రి […]
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం అవినీతి బయటపెడతాం, విచారణ జరుపుతాం అంటూ జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ ఘాటుగా బదులిచ్చారు. బీజేపీ అంటే ‘బక్వాస్ జుమ్లా పార్టీ’ తప్ప మరొకటి కాదు అన్నారు. ఎన్డీఏలో సీబీఐ, ఈడీ, ఐటీ లాంటి సంస్థలు భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయన్నారు. జుమ్లా చేయడానికి చూస్తాయని […]