ప్రస్తుతం అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇవి చాలదన్నట్లు వంట గ్యాస్ ధరలు కూడా పెరిగి సామాన్యుడికి గుదిబండలుగా మారుతున్నాయి. ఇలాంటి సమయంలో ఓ స్టవ్ మార్కెట్ లోకి రానుంది. గ్యాస్, కరెంట్ అవసరం లేకుండానే ఈ స్టవ్ ను వినియోగించుకోవచ్చు.
మనిషి జీవితంలో వంట చేయడం అనేది నిత్యకృత్యం. మహా అయితే ఒకటి రెండుసార్లు మాత్రమే బయట తినే ప్రయత్నం, ధైర్యం చేస్తారు. దాదాపుగా ఇంట్లో వండుకోవడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా రూమ్స్ లో ఉండే బ్యాచిలర్స్ ఈ ఇండక్షన్ స్టవ్స్ ని ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే వారు చదువు, ఉపాధి కోసం వేరే ప్రాంతానికి వెళ్తారు. అక్కడ గ్యాస్ స్టౌవ్, ఎల్‌పీజీ తీసుకోవడం కాస్త కష్టం. అందుకే సింపుల్ గా ఇండక్షన్ స్టౌవ్ తీసుకోవాలి అనుకుంటారు. కానీ, ఏది […]