జీవితం ఉన్నతంగా ఉండాలని.. ఉన్నత చదువులు చదివి.. విదేశాలకు వెళ్తుంటారు చాలా మంది. అలా వెళ్లిన వారు అక్కడ చాలా ఇబ్బందులను ఎదుర్కొటారు. అందులో జాతివివక్ష ముఖ్యమైంది. ఈ వివక్ష కారణంగా గతంలో చాలా మందిని కాల్చి చంపడమే కాకుండా కిడ్నాప్ కూడా చేసిన సంఘటనలు మనం చాలానే చూశాం. తాజాగా సోమవారం ఓ కుటుంబం కిడ్నాప్ కు గురైన మరో సంఘటన కాలిఫోర్నియాలో సంచలనం సృష్టించింది. కిడ్నాప్ కు గురైన వారిలో 8 నెలల పసికందు […]
మానవ అక్రమ రవాణా నలుగురు ప్రాణాలను బలితీసుకుంది. అగ్రరాజ్యం అమెరికాలోకి ఆక్రమంగా ప్రవేశించేందుకు ఓ భారతీయ కుటుంబం చేసిన ప్రయత్నం విషాదాంతమైంది. అమెరికా – కెనడా సరిహద్దుల్లో తీవ్రమైన మంచు తుపాను కారణంగా చలికి గడ్డకట్టుకుని ఆ కుటుంబమంతా దుర్మరణం చెందింది. మృతుల్లో మూడేళ్ల చిన్నారి కూడా ఉండటం విచారకరం. వివరాల్లోకి వెళ్తే.. మైనస్ 36 డిగ్రీల ఉష్ణోగ్రత, కనుచూపు మేరలో అంతా మంచు మేటలే. దీనికి తోడు తీవ్రమైన మంచు తుపాను. ఆపై చిమ్మచీకటి. ఇంతటి […]