ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రావడానికి కొత్త సినిమాలు ముస్తాబవుతున్నాయి. దాదాపుగా అన్నీ చిన్న చిత్రాలే షెడ్యూల్ చేసుకున్నాయి. తెలుగు, తమిళ్ డబ్బింగ్ మూవీస్ థియేట్రికల్ రిలీజ్ డేట్ లాక్ చేసుకుని, ప్రమోషన్స్‌లో వేగం పెంచాయి.
ఎప్పుడైతే స్టార్ హీరోయిన్ సమంత తనకు మయోసైటిస్ అనే వ్యాధి సోకిందని ధైర్యంగా బయటకు చెప్పిందో.. ఆ తర్వాత మరికొంత మంది కథానాయికలు తమ హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడారు. తాజాగా యంగ్ యాక్ట్రెస్ నందితా శ్వేత గత కొంత కాలంగా తను ఓ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడించింది.