ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇల్లు కట్టుకునే సమయంలో రూ. 3 లక్షలు ఆర్థిక సహాయం చేస్తామని తెలిపింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ప్రకటించింది.
తెలంగాణ కేబినెట్ గురువారం భేటీ అయ్యింది. రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలో భాగంగా కొత్త పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ వివరాలు..