తెలంగాణ కేబినెట్ గురువారం భేటీ అయ్యింది. రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలో భాగంగా కొత్త పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ వివరాలు..
ఎన్నికలు సమీపిస్తోన్న వేళ సీఎం కేసీఆర్ దూకుడు పెంచారు. వరుగా మూడో సారి గెలిచి.. హ్యాట్రిక్ సాధించాలని బలంగా నిర్ణయించుకున్నారు. మరో ఆరు నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో కేసీఆర్ ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హమీలు నేరవేర్చడం, కొత్త పథకాలు తీసుకురావడం చేస్తోంది. ఇక గురువారం ప్రగతి భవన్‌లో జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీనిలో భాగంగా కేసీఆర్ మరో పథకం అమలు దిశగా అడుగులు వేయనున్నట్లు తెలిసింది. ఈ పథకం ద్వారా లబ్దిదారులకు 3 లక్షలు ఇవ్వనున్నారు. ఇక కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. మరి ఇంతకు కేసీఆర్ తీసుకువచ్చిన కొత్త పథకం ఏంటి.. అర్హులు ఎవరు వంటి వివరాలు..
తెలంగాణ ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న గృహలక్ష్మి పథకాన్ని అమలు చేసేందుకు కేబినెట్ నిర్ణయించినట్టు మంత్రి హరీశ్ రావు తెలిపారు. గృహలక్ష్మి పథకం కింద.. సొంత స్థలం ఉన్న ప్రజలకు మూడు లక్షల నగదు సాయం ఇవ్వనున్నట్టు మంత్రి తెలిపారు. ఈ పథకం కింద.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది లబ్ధి పొందనున్నట్టు వెల్లడించారు. ఒక్కో నియోజకవర్గానికి 3 వేల ఇళ్లు ఇస్తామని ఈ సందర్భంగా హరీశ్ రావు తెలిపారు. ఇందుకోసం.. బడ్జెట్‌లో ఏకంగా 12 వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు గుర్తు చేశారు. ఈ పథక లబ్ధిదారులకు మూడు లక్షలను గ్రాంట్‌గా.. ఆ ఇంటి యజమానురాలి పేరు మీద మంజూరు చేయనున్నట్టు మంత్రి వివరించారు.
గృహలక్ష్మి పథకానికి సంబంధించిన నిబంధనలు కూడా చాలా సులభంగా ఉంటాయని తెలపడమే కాక.. లబ్ధిదారుల ఎంపిక కూడా వెంటనే ప్రారంభించనున్నట్టు మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇళ్ల మంజూరు విషయంలో గత ప్రభుత్వాలు నగదు ఇచ్చి వాటిని అప్పుగా మార్చి.. ప్రజలపై ఆ భారం వేశారు. క్రమంలో కేసీఆర్ ప్రభుత్వం ఆ రుణాలన్నింటినీ పూర్తిగా మాఫీ చేయనుంది. ఈ రుణాల మాఫీ కోసం ఖర్చయ్యే నాలుగు వేల కోట్లను కూడా ప్రభుత్వమే భరిస్తుంది’’ అని తెలిపారు.
మరోవైపు.. రాష్ట్రంలో ఎప్పటి నుంచో చర్చ జరుగుతున్న పోడు భూముల పట్టాలపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 4 లక్షల ఎకరాల పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. కేబినెట్ భేటీలో మరో కీలక అంశం అయిన దళిత బంధు పథకంపై కూడా నిర్ణయం తీసుకున్నారు. కేవలం హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే దళిత బంధును ప్రారంభించారని.. ఆ తర్వాత పథకం అటకెక్కించదని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల చేస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సర్కారు. త్వరలోనే మరో లక్షా 30 వేల కుటుంబాలకు దళిత బంధు ఇవ్వనున్నట్టు హరీశ్ రావు తెలిపారు. మరి కేసీఆర్ ప్రభుత్వం తీసుకువచ్చిన గృహలక్ష్మి పథకం ద్వారా సొంత ఇంటి కల సాకారం అవుతుందని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.