మన సంప్రదాయంలో ముఖ్యంగా నమస్కారం చెప్పుకోవాలి. పెద్దవాళ్లు, గొప్పవారు, అపరిచితులు ఇలా ఎవరు మనకు తారసపడిన వారిని పలకరించేందుకు ముందుగా చెబుతూ చేసే సంజ్ఞ నమస్కారు. రెండు చేతులు జోడించి సవినియంగా పలకరిస్తూ ఎదుటివారి ఆదరణ చూరగొంటారు. హిందూ సాంప్రదాయంలో నమస్కారం చేయు పద్ధతులు రెండు ఉన్నాయి. అందులో ఒకటి సాష్టాంగ నమస్కారం. రెండవది పంచాంగ నమస్కారం. ఎనిమిది అంగాలైన వక్షస్థలం, నుదురు, రెండు చేతులు, రెండు కాళ్ళూ , రెండు కనులూ భూమిపై ఆన్చి పురుషులు […]
మనిషి వయస్సు పెరుగుతున్నకొద్దీ ఒక్కో అవయవం పనిచేయకుండా పోతుంది. ఎప్పుడైతే మెదడు ఇలా మొద్దుబారిపోతుందో, పనిచేయడం ఆగిపోతుందో అప్పుడే గత జ్ఞాపకాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఫోన్ మెమొరీని డిలిట్ చేసినట్టు. అంటే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ఏం జరిగిందో ఏమీ గుర్తుండదు. ఎవరైనా గుర్తు చేసినా పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం కష్టం. ఈ పరిస్థితినే అల్జీమర్స్ అంటారు. మెదడులో కణాలు చనిపోవడంతో సంభవించే నాడీ సంబంధిత వ్యాధి. దీనివల్ల జ్ఞాపకశక్తి, ఆలోచన […]
ఓ మహిళ వివాహం అయిన రెండు రోజులకే తన భర్త మాజీ భార్యకు కిడ్నీ దానం చేసి పెద్ద మనసు చాటుకుంది. ఇప్పుడు తామిద్దరం కిడ్నీ సిస్టర్స్ అయ్యాం అని చెప్తోంది. ఫ్లోరిడాకు చెందిన జిమ్, మైలాన్ మెర్తే దాదాపు రెండు దశాబ్దాల క్రితం విడాకులు తీసుకున్నారు. అయినప్పటికి పిల్లలను కలిసి పెంచడంతో వారిద్దరు మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. ఇక భార్య నుంచి విడిపోయిన తర్వాత జిమ్‌కు డెబ్బీ నీల్-స్ట్రిక్‌ల్యాండ్‌తో పరిచయం ఏర్పడింది. గత పదేళ్లుగా వారు […]
ట్రాఫిక్ సహా కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేయడంలో సైబరాబాద్ పోలీసులు ఎప్పుడూ ముందుంటారు. ఇందుకోసం స్టార్ హీరో, హీరోయిన్ల సినిమా పోస్టర్, ఫేమస్ డైలాగులను వాడేస్తారు. దేశ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ఎంతలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో ట్విటర్ వేదికగా సినిమా నటీనటులతో మీమ్స్ తరహాలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. బ్రహ్మానందంతో రూపొందించిన మీమ్స్ నెటిజన్లను చాలా ఆకట్టుకున్నాయి. కరోనా వేళ మాస్కు ప్రాధాన్యాన్ని చాటేందుకు కూడా పోలీసులు […]
కూలి పని చేసుకునేవారు సైతం తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించడానికి ఇష్టపడరు. అప్పోసప్పో చేసి మరి పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకే పంపుతారు. అందుకు వారు చెప్పే కారణం.. సర్కారీ బడుల్లో సరిగా చెప్పరని. అందుకు తగ్గట్టుగానే గవర్నమెంట్ టీచర్ కొలువు చేసే వారు కూడా తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలకే పంపుతారు. కానీ ఈ కలెక్టరమ్మ మాత్రం వీరికి భిన్నం. జిల్లా మొత్తానికి అధికారి హోదాలో ఉన్న కలెక్టర్ తన కుమార్తెను మాత్రం ప్రభుత్వ అంగన్వాడి […]