నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా అతివేగం, మద్యం తాగి వాహనం నడపడం, నిర్లక్ష్యంగా వాహనం నడపడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు జరుగుతుంటాయి. తాజాగా కేరళలో గ్యాస్ ట్యాంకర్ ప్రమాదానికి గురైంది. దీంతో దాని నుంచి భారీగా గ్యాస్ లీకైంది. స్థానికులు అక్కడి నుంచి భయంతో పరుగులు తీశారు.
ఇటీవల దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్లపై నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయిన అధికారులు అంటున్నారు.