నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా అతివేగం, మద్యం తాగి వాహనం నడపడం, నిర్లక్ష్యంగా వాహనం నడపడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు జరుగుతుంటాయి. తాజాగా కేరళలో గ్యాస్ ట్యాంకర్ ప్రమాదానికి గురైంది. దీంతో దాని నుంచి భారీగా గ్యాస్ లీకైంది. స్థానికులు అక్కడి నుంచి భయంతో పరుగులు తీశారు.
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా అతివేగం, మద్యం తాగి వాహనం నడపడం, నిర్లక్ష్యంగా వాహనం నడపడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇంకా దారుణం ఏమిటంటే ప్రమాదకరమైన వాటిని రవాణ చేస్తున్న వాహనాలు రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు.. ఘోరం చోటుచేసుకుంది. ఇటీవలే ఓ ప్రాంతంలో పెట్రోల్ ట్యాంక్ పడిపోగా.. దాని కోసం వెళ్లిన స్థానిక ప్రజలు దాదాపు 100మంది అగ్నికి ఆహుతయ్యారు. అలానే ఇటీవలే ఏపీలో నడి రోడ్డుపై గ్యాస్ ట్యాంకర్ పడటంతో అందరు ఆందోళనకు గురయ్యారు. తాజాగా ఓ ప్రమాదంలో గ్యాస్ ట్యాంకర్ నుంచి భారీగా గ్యాస్ బయటకు చిమ్మింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కేరళలోని ఓ ప్రాంతంలో వెళ్తున్న గ్యాస్ ట్యాంకర్ ను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఏమి గాయాలు కాలేదని సమాచారం. అయితే కారు బలంగా ఢీ కొట్టడంతో ట్యాంకర్ కి రంధ్రం పడింది. దీంతో తెల్లని పొగతో గ్యాస్ భారీగా లీకైంది. దీంతో అటుగా వెళ్తున్న వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. అంతేకాక అక్కడి నుంచి వాహనాలను వెనక్కి తిప్పుకుని దూరంగా వెళ్లిపోయారు. చాలా సమయం పాటు గ్యాస్ భారీగా ట్యాంకర్ నుంచి వెలువడింది. స్థానికులు స్థానిక అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకుని లీకవుతున్న గ్యాస్ ను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.
చాలా సమయం పాటు తీవ్రంగా శ్రమించి.. గ్యాస్ ను అదుపులోకి తెచ్చారని సమాచారం. అయితే భారీగా గ్యాస్ లీక్ కావడంతో ఆ ప్రాంతమంత తెల్లటి పొగలు కమ్ముకున్నాయి. ఊహించని ఘటనతో స్థానికులతో పాటు వాహనదారులు షాకయ్యారు. ఏం జరుగుతుందోనని అందరూ భయభ్రాంతులకు లోనయ్యారు. ప్రమాద ఘటనకు సమీపంలో ఉన్న స్థానికులను పోలీసులు, అగ్నిమాప సిబ్బంది దూరంగా పంపించారు. అదృష్టం బాగుండి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ఏదైన మంటలు అంటుకుని ఉంటే ఘోరం జరిగి ఉండేదని స్థానికులు వాపోతున్నారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.