కేంద్ర మాజీ మంత్రి, జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్(75) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో.. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ.. గురువారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు శరద్ యాదవ్ కుమార్తె సుభాషిణి వెల్లడించారు. దాంతో దేశ రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సోషలిస్టు నేతగా, జేడీయూకు అధ్యక్షుడిగా ఎంతో సేవ చేశారు శరద్ యాదవ్. […]
కాంగ్రెస్ పార్టీలో విషాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి పండిట్ సుఖ్ రామ్(94) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. మే4వ తేదీన సుఖ్ రామ్ మనాలిలో బ్రెయిన్ స్ట్రోక్ కు గురవ్వగా.. అక్కడ మండిలోని ప్రాంతీయ ఆస్పత్రిలో చేర్చారు. మరింత మెరుగైన చికిత్స కోసం ఈ నెల 7న ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చామని ఆయన మనవడు ఆశ్రయ్ శర్మ గత రాత్రి ఫేస్‌బుక్ పోస్టులో తెలిపారు. ఢిల్లీకి […]
జాతీయ కాంగ్రెస్ పార్టీలో విషాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 80 సంవత్సరాలు. మంగళూరులో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ ఏడాది జులైలో ఇంట్లో యోగా చేస్తున్న సందర్భంగా ఆయన కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన మెదడులో రక్తం గడ్డకట్టింది.. వెంటనే ఆయనను ఐసీయూలో చేర్చారు. గడ్డకట్టిన రక్తాన్ని తొలగించేందుకు ఆయనకు సర్జరీ నిర్వహించారు. ఆ రోజు నుంచి వైద్యులు రొటీన్ డయాలసిస్‌తో పాటు […]