కేంద్ర మాజీ మంత్రి, జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్(75) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో.. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ.. గురువారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు శరద్ యాదవ్ కుమార్తె సుభాషిణి వెల్లడించారు. దాంతో దేశ రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సోషలిస్టు నేతగా, జేడీయూకు అధ్యక్షుడిగా ఎంతో సేవ చేశారు శరద్ యాదవ్. ఆయన హఠాన్మరణం రాజకీయాలకు తీరని లోటు అని పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర మాజీ మాంత్రి, జేడీయూ అధ్యక్షుడు, సోషలిస్ట్ నేత శరద్ యాదవ్(75) అనారోగ్యంతో మరణించారు. గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తీవ్ర అస్వస్థతకు గురై.. ఇంట్లోనే స్ఫృహ కోల్పోయి కిందపడ్డారు. దాంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గురుగ్రామ్ లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు వైద్యులు తెలిపారు. దాంతో ఎమర్జెన్సీ వార్డులో చేర్పించి చికిత్స అందికస్తున్నారు. చికిత్స పొందుతున్న క్రమంలోనే గురువారం రాత్రి సుమారు 10.19 గంటలకు శరద్ యాదవ్ మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు ఆయన కుమార్తె సుభాషిణి. శరద్ యాదవ్ ను ఆస్పత్రికి తీసుకువచ్చే సరికే ఆయనకు పల్స్ లేదు, దాంతో మేము సీపీఆర్ ప్రయత్నించి చూశాం.. కానీ ఫలితం లేకుండా పోయింది అని డాక్టర్లు తెలిపారు. ఇక శరద్ యాదవ్ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాడు. లోక్ సభకు ఏడు సార్లు, రాజ్యసభకు మూడు సార్లు ఎన్నికయ్యారు. ఇక 2017లో బీహార్ ముఖ్యమంత్రి బీజేపీతో చేతులు కలపడంతో జేడీయూ నుంచి బయటకు వచ్చి 2018లో లోక్ తాంత్రిక్ జనతాదళ్ (LJD)పార్టీని ఏర్పాటు చేశారు. శరద్ యాదవ్ మృతికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపాన్ని ప్రకటించారు.