సాధారణంగా ఏదైనా హూటల్.. రెస్టారెంట్ కి వెళ్తే అక్కడ సర్వీస్ నచ్చకపోయినా.. ఐటమ్స్ నచ్చకపోయినా మేనేజర్ కి ఫిర్యాదు చేస్తాం. తర్వాత వారు జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఓ మహిళ మాత్రం తనకు సూప్ నచ్చలేదని, సర్వీస్ చేసేది ఇలాగేనా? అంటూ వేడివేడి సూప్‌ను రెస్టారెంటు మేనేజర్‌పై పోసేసి వెళ్లి పోయింది. వేడివేడి సూప్ ముఖంపై పడడంతో రెస్టారెంట్ మేనేజర్ షాక్ కు గురయింది. తర్వాత ఆ కస్టమర్ కారు నంబరును గుర్తించిన మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు […]
ప్రమాదం ఎప్పుడు.? ఎలా సంభవిస్తుందో ఎవ్వరికీ తెలియదు. కొన్ని ఊహించని ఘటనలు, ప్రమాదాలు మనిషి జీవితాన్ని అమాంతం మార్చేస్తాయి. రాజస్థాన్ లోని బికనీర్ కు చెందిన కర్ణీ బిష్ణోయ్ అనే 38 ఏళ్ల వ్యక్తి జీవితమూ అలాగే మారిపోయింది. అనూహ్య ప్రమాదంలో అతడి ముఖమే పూర్తిగా మారింది. గత ఏడాది సెప్టెంబర్ లో ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తున్న బిష్ణోయ్ పై ఓ ఎద్దు దాడి చేసింది. కొట్లాడుకుంటున్న ఎద్దులు వెళ్లిపోయేంత వరకు ఆగుదామనుకున్న బిష్ణోయ్ కారును […]
కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్, సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే టిక్‌టాక్‌లో అడుగుపెట్టిన ఈ విధ్వంసకర బ్యాట్స్‌మన్ రోజుకో వీడియోతో అభిమానులను అలరిస్తున్నాడు. ఖాళీ సమయం దొరికిందంటే చాలు సామాజిక మాధ్యమాల్లో బిజీ అయిపోతుంటాడు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్. తన పిల్లలు, సతీమణి కాండీస్‌తో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ ఫుల్ […]
ఒకప్పుడు ముసుగు వేసుకున్నా… మాస్క్ వేసుకున్నా హడలిచచ్చేవాళ్ళు ఇప్పుడు మాస్క్ వేసుకోకపోతే భయపడిచస్తున్నారు. 500 సంవత్సరాలుగా మాస్కులను ఉపయోగిస్తూనే వస్తున్నారు. ఒకప్పుడు నోటిని, ముక్కును కప్పేలా ఉండే మాస్కులతో బ్యాంకుల దోపిడీ చేసేవారు, ముసుగు మాస్క్ అంటే దొంగలేమో అనుకునే రోజులూ ఉన్నాయి. కానీ ఇప్పుడు కరోనా కాలంలో మాస్క్ ఎంత సాధారణం అయిపోయిందంటే, దానిని ‘నార్మల్’ అని చెప్పుకుంటున్నారు. మాస్క్‌లు ఉపయోగించడం కొత్తగా అనిపించినా అవి మనుషులకు అంత కొత్తేం కాదు. మనిషితో పాటు శతాబ్దాలుగా […]