గత ఏడాది పేలవ ఫామ్ తో తీవ్ర విమర్శలు ఎదుర్కొని టీ20ల్లో కెప్టెన్సీని సైతం పోగొట్టుకున్నాడు టెంబా బవుమా. అయితే ఇదంతా కొన్ని రోజుల కిందట ముచ్చట. ఇప్పుడు అతడు భీకర ఫామ్ లో ఉన్నాడు. ఈ క్రమంలోనే అద్భుత ఫామ్ లో ఉన్న బవుమా ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. దాంతో టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ సరసన చేరాడు.
క్రికెట్ లో రికార్డులకు ఆయుష్షు తక్కువ అంటారు. ప్రపంచంలో ఏదో ఒకమూలన దాదాపు ప్రతిరోజు ఏదో ఒకరికార్డు నమోదు అవుతూనే ఉంటుంది. వాటిని మరికొందరు ఆటగాళ్లు బద్దలు కొట్టడమో,సమయం చేయడమో జరుగుతుంది. అయితే ప్రపంచ క్రికెట్ లో చాలా మంది ఆటగాళ్లు సాధించిన రికార్డు లు ఒక ఎత్తు అయితే.. ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్ మన్ సాధించిన రికార్డులు మరోక ఎత్తనే చెప్పాలి. ఇప్పటి వరకు చాలా రికార్డులు డాన్ బ్రాడ్ మన్ పేరిటే ఉన్నాయి. […]